
కాశీక్షేత్రంలో 1,25,000 సార్లు మహా మృత్యుంజయ మంత్ర జపం మరియు రుద్రాభిషేకం
మహా మృత్యుంజయ ఆలయం
కార్తీక పౌర్ణమి ప్రత్యేకం
10K+పూజలు నిర్వహించబడ్డాయి
You won't be charged yet
హిందూ ధర్మంలో కార్తీక పౌర్ణమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజున శివారాధన, దీపారాధన, అభిషేకాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ప్రతీతి. అపమృత్యు భయాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధించాలని, గ్రహదోషాల నుంచి ఉపశమనం కలగాలని, వివాహం, సంతానం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలగాలని కోరుకునే భక్తుల కోసం వేదమందిర్ ప్రత్యేక పూజలను నిర్వహిస్తోంది. రుద్రహోమం, మహా మృత్యుంజయ మంత్రస్మరణ, 1,116 పార్థివ లింగాలకు అభిషేకం, శివపార్వతుల కళ్యాణంలో మీ నామగోత్రాలతో పాల్గొని పరమశివుని అనుగ్రహాన్ని కోరుకోండి.
సకల దోషాల శాంతికి రుద్రహోమం
జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగి, ఇంట్లో ప్రశాంతత నెలకొనాలని కోరుకునేవారికి రుద్రహోమం విశిష్టమైన శివారాధన. శ్రీరుద్రంలోని నమకం, చమకం మంత్రాలను పఠిస్తూ ఈ హోమాన్ని నిర్వహిస్తారు. అగ్నికి పవిత్రమైన పూజా ద్రవ్యాలను సమర్పిస్తూ పరమశివుని ప్రార్థిస్తారు. గ్రహపీడలు, పితృదోషాలు, అపమృత్యు భయాలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలగాలని భక్తులు సంకల్పిస్తారు. కుటుంబసభ్యుల ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి, ఇంట్లో సుఖశాంతులు కోరుకునేవారు ఈ పూజలో పాల్గొనవచ్చు. ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబ క్షేమం, సకల శుభాలు కలగాలని రుద్రుని వేడుకోవచ్చు.
దీర్ఘాయుష్షు కోసం మృత్యుంజయ మంత్రం
‘త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం’ అంటూ సాగే మహా మృత్యుంజయ మంత్రం పరమశివుని మృత్యుంజయ స్వరూపాన్ని స్తుతిస్తుంది. ఋగ్వేదంలో ప్రస్తావించిన ఈ మంత్రాన్ని స్మరిస్తూ భక్తులు రోగబాధలు తొలగి, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తారు. తమ ఆరోగ్యం మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, జీవిత భాగస్వామి సహా కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుకునేవారు ఈ మంత్రస్మరణలో పాల్గొనవచ్చు. అపమృత్యు భయాల నుంచి ఉపశమనం, అనారోగ్య బాధల నుంచి విముక్తి, దీర్ఘాయుష్షు, కుటుంబ ఆరోగ్యం కోసం పరమశివుడిని వేడుకోండి.
వివాహ దాంపత్య సౌఖ్యానికి శివపార్వతుల కళ్యాణం
వివాహం ఆలస్యమవుతోందా? భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగి అన్యోన్యత పెరగాలని కోరుకుంటున్నారా? సంతాన సౌభాగ్యం కోసం ఎదురుచూస్తున్నారా? ఇలాంటి కోరికలతో ఉమామహేశ్వరులను ఆరాధించడం ఎంతో విశిష్టమైనది. శివపార్వతుల దివ్యకళ్యాణం ఆదర్శ దాంపత్యానికి ప్రతీక. వారి కళ్యాణాన్ని దర్శించి, పూజలో పాల్గొంటూ తగిన జీవిత భాగస్వామి లభించాలని, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలని, సంతానం కలగాలని ప్రార్థించవచ్చు. కుటుంబంలో కలహాలు తొలగి ఐక్యత, సంతోషం నెలకొనాలని వేడుకోవచ్చు. వివాహ ప్రాప్తి, దాంపత్య అన్యోన్యత, సంతాన సౌభాగ్యం, కుటుంబ ఐక్యత కోసం ఈ కళ్యాణోత్సవంలో భాగస్వాములు కండి.
ధైర్యం, ఆత్మవిశ్వాసానికి శివానుగ్రహం
పరమశివుడిని ఆశ్రయించే భక్తులకు ఆయన ఆరాధన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తుందని పురాణాలు తెలియజేస్తాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా, చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కకపోయినా మహాదేవుడిని ప్రార్థించవచ్చు. ప్రతికూల పరిస్థితులు తొలగి అనుకున్న పనులు సాఫీగా సాగాలని, నిర్ణయాలు తీసుకునే శక్తి కలగాలని, ప్రతి అడుగులోనూ శుభం కలగాలని కోరుకోవచ్చు. శత్రుబాధల నుంచి ఉపశమనం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, కార్యసిద్ధి కోసం రుద్రుని భక్తితో వేడుకోండి.
కుటుంబ శ్రేయస్సుకు పార్థివ లింగాభిషేకం
మట్టితో తయారుచేసిన 1,116 శివలింగాలకు అభిషేకం చేయడం ఈ పూజలో ప్రత్యేక ఆకర్షణ. ప్రతి లింగాన్నీ పరమశివుని స్వరూపంగా భావించి భక్తితో అభిషేకాలు సమర్పిస్తారు. ఒక్కో శివలింగానికి చేసే అభిషేకం వెనుక ఒక్కో ప్రార్థన, ఒక్కో కోరిక ఉంటాయి. కుటుంబంలో ఎవరికీ అనారోగ్య సమస్యలు రాకూడదని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలని భక్తులు కోరుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ విశేష అభిషేకంలో పాల్గొని కుటుంబ క్షేమం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి, మనశ్శాంతి, సర్వకార్యసిద్ధి కలగాలని పరమేశ్వరుడిని ప్రార్థించండి.
కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, అనుకోని ఆపదలు దరిచేరకుండా శివపార్వతులను ప్రార్థించడం.
వివాహ ప్రయత్నాల్లోని ఆటంకాలు తొలగి తగిన జీవిత భాగస్వామి లభించాలని, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత పెరగాలని వేడుకోవడం.
గ్రహదోషాలు, పితృదోషాల ప్రభావంతో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగి, జీవితంలో ప్రశాంతత, అనుకూలత నెలకొనాలని పరమశివుని వేడుకోవడం.
అప్పులు, ఆర్థిక ఒడిదుడుకులు తగ్గి ఆదాయ మార్గాలు మెరుగుపడాలని, కుటుంబానికి ధనస్థిరత్వం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించడం.
శత్రుబాధలు, ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభించాలని, చేపట్టిన పనుల్లో విజయం, కుటుంబంలో సకల శుభాలు కలగాలని ప్రార్థించడం.
విఘ్నేశ్వరుని ప్రార్థనతో క్రతువు ప్రారంభించి, నిర్విఘ్నంగా పితృకార్యాలు సంపూర్ణమయ్యేలా గణపతి అనుగ్రహాన్ని అర్థిస్తారు.
భక్తుల పేర్లు, గోత్రాలతో సంకల్పం చేసి, కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.
వేదమంత్రాలతో నమక చమక పారాయణం, మహా మృత్యుంజయ మంత్రస్మరణ నిర్వహించి పరమశివుని ఆరాధిస్తారు.
రుద్రహోమం నిర్వహించడంతో పాటు 1,116 పార్థివ లింగాలకు శివనామస్మరణతో అభిషేకాలు సమర్పిస్తారు.
ఉమామహేశ్వరుల కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి, భక్తుల కుటుంబాల్లో సుఖసంతోషాలు, శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.
గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.
అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.
విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.