కార్తవీర్యార్జున జయంతి ప్రత్యేకం

నష్టద్రవ్య ప్రాప్తి, ధనస్థిరత్వం కోసం కార్తవీర్యార్జున హోమం

  • ఆస్తి నష్టం
  • ధన నష్టం
  • వ్యాపార నష్టాలు
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, తిరుపతి
17 నవంబర్, మంగళవారం | కార్తవీర్యార్జున జయంతి ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

చేజారిన సంపద తిరిగి చేరాలని, ఆర్థిక ఆటంకాలు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందాలని, సంపాదించిన ధనం సుస్థిరంగా నిలవాలని కోరుకునేవారికి కార్తవీర్యార్జున ఆరాధన విశిష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. వెయ్యి చేతుల అపార పరాక్రమంతో విరాజిల్లిన కార్తవీర్యార్జునుడు గురు దత్తాత్రేయుడి అనుగ్రహంతోనే అసాధారణ శక్తిసామర్థ్యాలను పొందాడు. గురుకృపతో ఉన్నతిని అందుకున్న ఈ మహారాజు ఆరాధన నష్టద్రవ్య ప్రాప్తికి, సంపద వృద్ధికి, కార్యసిద్ధికి ప్రతీక. అందుకే కార్తవీర్యార్జునుడితో పాటు ఆయన గురువైన దత్తాత్రేయుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. మహిమాన్విత కార్తవీర్యార్జున జయంతి పర్వదినాన వారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఇంతటి విశేషం ఉంది గనుకే ఈ శుభదినాన వేదమందిర్ తిరుపతిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కార్తవీర్యార్జున హోమంతో పాటు గురు దత్తాత్రేయ పాదుకాపూజ నిర్వహిస్తోంది. ఈ పవిత్ర వైదిక ఆరాధనలో భాగస్వాములై నష్టద్రవ్య ప్రాప్తి, ధనస్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు, సర్వకార్యసిద్ధి కలగాలని భక్తితో ప్రార్థించవచ్చు.

నష్టద్రవ్య ప్రాప్తికి ‘కార్తవీర్యార్జున హోమం’
కార్తవీర్యార్జునుడి స్మరణతో నష్టపోయిన సంపద తిరిగి లభిస్తుందనే పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. అగ్నిపురాణంలోని కార్తవీర్యార్జున ప్రస్తావనలో ఆయన స్మరణతో రాజ్యంలో ద్రవ్యనష్టం ఉండదనే విశేషం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్తవీర్యార్జున హోమం చేయించడం ద్వారా పోగొట్టుకున్న ధనం, వస్తువులు తిరిగి పొందాలని, నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు చక్కబడాలని, సంపాదనలో స్థిరత్వం కలగాలని భక్తులు సంకల్పిస్తారు. అనుకోని ఆర్థిక నష్టాలు, వ్యాపారపరమైన ఆటంకాల నుంచి ఉపశమనం లభించి, సంపద వృద్ధికి అనుకూలత ఏర్పడాలని స్వామివారిని ప్రార్థిస్తారు.

గురు అనుగ్రహానికి ‘దత్తాత్రేయ పాదుకాపూజ’
కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతుల వరాన్ని ప్రసాదించిన గురువు దత్తాత్రేయుడు. బ్రహ్మాండ పురాణం 69వ అధ్యాయంలో దత్తాత్రేయుడి అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు ఈ వరాన్ని పొందిన వృత్తాంతం వివరించబడింది. అందుకే కార్తవీర్యార్జున హోమంతో పాటు గురు దత్తాత్రేయ పాదుకాపూజకు విశేష ప్రాధాన్యత ఉంది. గురుపాదుకల ఆరాధన ద్వారా అజ్ఞానం తొలగి సద్బుద్ధి కలగాలని, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం సిద్ధించాలని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే మార్గదర్శనం లభించాలని ప్రార్థిస్తారు. గురుకృపతో కార్యసిద్ధి, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతి కలగాలని కోరుకుంటారు.

కార్తవీర్యార్జున జయంతి విశిష్టత
కార్తవీర్యార్జునుడి జీవితం కేవలం పరాక్రమగాథ మాత్రమే కాదు. సంకల్పబలం, ఇంద్రియ నిగ్రహం, ధర్మబద్ధమైన పాలనకు సంబంధించిన గొప్ప సందేశం కూడా కీర్తిస్తోంది. శ్రీమద్భాగవతం(9.15) ప్రకారం దత్తాత్రేయుడి అనుగ్రహంతో ఆయన శత్రువులను ఎదుర్కొనే అజేయశక్తితో పాటు తేజస్సు, కీర్తి, శారీరక బలం, యోగసిద్ధులను పొందాడు. బ్రహ్మాండ పురాణంలోని కార్తవీర్యార్జున వృత్తాంతం ప్రజలను ధర్మమార్గంలో పరిరక్షించాలనే ఆయన సంకల్పాన్ని వివరిస్తుంది. అందుకే ఈ జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తారు. తద్వారా భౌతిక సంపదతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, శత్రువులను ఎదుర్కొనే ధైర్యం, ధర్మబద్ధంగా వ్యవహరించే వివేకం సిద్ధించాలని ప్రార్థిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా అధిగమించి, గౌరవప్రదమైన జీవనాన్ని సాగించే శక్తినిస్తుందని ప్రతీతి. 

శుభఫలాల కోసం విశేష ఆరాధన
ఈ కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే కార్తవీర్యార్జున హోమం, గురు దత్తాత్రేయ పాదుకాపూజలో భాగస్వాములై స్వామివారి అనుగ్రహాన్ని కోరుకోండి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, వ్యాపారాభివృద్ధి కలగాలని, సంపద నిలకడగా ఉండాలని, చేపట్టిన పనుల్లో విజయాలు సిద్ధించాలని భక్తిశ్రద్ధలతో సంకల్పించండి. గురు దత్తాత్రేయుని కరుణ, కార్తవీర్యార్జునుడి అనుగ్రహం మీ జీవితంలో నూతన శుభారంభాలకు మార్గం చూపాలని ప్రార్థిస్తూ ఈ విశేష పూజలో పాల్గొనండి
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

నష్టద్రవ్య ప్రాప్తి

చేజారిన సంపద, పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి లభించాలని ప్రార్థన

2

ధనస్థిరత్వం

సంపాదించిన ఐశ్వర్యం నిలిచి, ఆర్థికంగా మరింత భద్రత ఏర్పడాలని సంకల్పం

3

శత్రు భయ నివారణ

ప్రత్యర్థుల ఇబ్బందులు, అనవసర వివాదాల నుంచి రక్షణ కలగాలని ఆరాధన

4

గురుకటాక్షం

దత్తాత్రేయుడి అనుగ్రహంతో సద్బుద్ధి, కుటుంబ శ్రేయస్సు, జీవితంలో సానుకూలత కలగాలని ప్రార్థన

పూజ ప్రక్రియ

1

సంకల్పం & గణపతి పూజ

భక్తుల పేరు, గోత్రంతో సంకల్పం స్వీకరించి, విఘ్న నివారణ కోసం శ్రీ గణపతి పూజతో ఆరాధన ప్రారంభిస్తారు.

2

కార్తవీర్యార్జున హోమం

కార్తవీర్యార్జున మంత్రాలతో హోమం నిర్వహించి, నష్టద్రవ్య ప్రాప్తి, ధనస్థిరత్వం, కార్యసిద్ధి కోసం ప్రత్యేక ఆహుతులు సమర్పిస్తారు.

3

గురు దత్తాత్రేయ పాదుకాపూజ

గురు దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు శాస్త్రోక్తంగా పూజ, అర్చన నిర్వహించి గురుకటాక్షం, సద్బుద్ధి, ఆత్మబలం కోసం ప్రార్థిస్తారు.

4
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, ఆశీర్వచనం

పూర్ణాహుతితో హోమాన్ని ముగించి, భక్తుల శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థిస్తారు

పూజలో మీకు లభించేవి

మీ నామ, గోత్రాలతో మహాసంకల్పం

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం

తిరుపతి

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.915K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
నష్టద్రవ్య ప్రాప్తి, ధనస్థిరత్వం కోసం కార్తవీర్యార్జున హోమం
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support