సంకటహర చతుర్థి ప్రత్యేకం

రుణ విముక్తి, ధనస్థిరత్వం కోసం రుణ విమోచన శక్తిగణపతి హోమం

  • ఆర్థిక ఇబ్బందులు
  • వ్యాపార అవరోధాలు
  • ఐశ్వర్యం
వైదిక యాగశాల, హైదరాబాద్, తెలంగాణ
27 నవంబర్, శుక్రవారం | సంకటహర చతుర్థి ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి, చేపట్టిన ప్రతి ప్రయత్నం సఫలం అవ్వాలనే ఆకాంక్షకు గణపతి ఆరాధన విశిష్టమైనది. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున విఘ్నరాజైన వినాయకుడిని గణపతి హోమం, సంకటహర గణపతి పూజలతో అర్చించడం విశేష ఫలప్రదాయకం. ఈ ద్వివిధ ఆరాధనలోని మంత్రశక్తి, సంకల్పబలం మనసుకు ధైర్యాన్ని, ఆలోచనలకు స్పష్టతను ప్రసాదిస్తాయని నమ్మకం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని ఆటంకాలు తొలగడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించడం వంటి శుభఫలాల కోసం ఈ ఆరాధనల ద్వారా విఘ్నవినాయకుడిని ప్రార్థించవచ్చు. నవంబర్ 27 సంకటహర చతుర్థి రోజున వేదమందిర్ నిర్వహిస్తున్న ఈ పవిత్ర క్రతువులో గోత్రనామాలతో పూజకు సంకల్పించి, సకల సంకటాల నివారణతో పాటు ఆయురారోగ్యాలు, అభివృద్ధి, కార్యసిద్ధి కోసం స్వామివారి కృపను ప్రార్థించవచ్చు.

సంకటహర చతుర్థి తిథి ప్రత్యేకం
ప్రతి కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థిగా ఆచరిస్తారు. 'సంకట' అంటే కష్టం. 'హర' అంటే తొలగించేవాడు. కష్టాలను తొలగించే గణపతిని ఈ రోజున విశేషంగా ఆరాధిస్తారు. భక్తుల కష్టాలను హరించే గణనాథుడికి ఈ తిథి అత్యంత ప్రీతికరమైనదిగా ప్రసిద్ధి. గణేశ పురాణంలోని ఉపాసనా ఖండం 59వ అధ్యాయంలో ఈ తిథి ఆరాధనా విశేషాలు వివరించబడ్డాయి. సంకటాలను తొలగించే స్వామిని ఈ పవిత్ర తిథినాడు మంత్రపూర్వకంగా ఆరాధించడం విశేష పుణ్యప్రదమనే విశ్వాసం ఉంది. అందుకే ఈ సందర్భంలో నిర్వహించే గణపతి హోమం, సంకటహర గణపతి పూజ మరింత విశిష్టతను సంతరించుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం వంటి అంశాల్లో ఎదురయ్యే సంకటాలు తొలగి, జీవితంలో సానుకూలత, అభివృద్ధి, కార్యసిద్ధి కలగాలని ఈ విశేష పూజల ద్వారా విఘ్నేశ్వరుడిని ప్రార్థించవచ్చు. 

కార్యవిఘ్నాల నివారణకు గణపతి హోమం
విఘ్నాలను తొలగించే అధిదేవతగా గణపతికి సనాతన ధర్మంలో అగ్రపూజా స్థానం లభించింది. ఏ శుభకార్యమైనా ముందుగా వినాయకుడిని స్మరిస్తారు. చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని కోరడమే ఈ ఆరాధన వెనుక ఉన్న అంతరార్థం. అందుకే వేదవ్యాసుడు సైతం మహాభారత రచనకు పూనుకున్నప్పుడు గణపతినే లేఖకుడిగా ప్రార్థించాడు. ఈ ఇతిహాస గాథ ఆయన బుద్ధి, జ్ఞానశక్తికి నిదర్శనంగా నిలిచాయి. అంతటి విజయాలు లభించాలనే ‘ఓం గం గణపతయే నమః’ వంటి గణపతి హోమద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తూ గణపతి హోమం నిర్వహిస్తారు. ప్రతి ఆహుతి ఒక ప్రార్థనగా, ప్రతి మంత్రోచ్చారణ ఒక సంకల్పంగా ఈ క్రతువు కొనసాగుతుంది. ఈ విధానంలో అగ్నిదేవుని సాక్షిగా విఘ్నేశ్వరుడిని ఆవాహన చేసి అర్చించడం విశేషం. ఈ హోమం ద్వారా ఉద్యోగాభివృద్ధి, వ్యాపార పురోగతి, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, నూతన ప్రయత్నాల్లో విజయం వంటి అభీష్టాల కోసం ప్రార్థించవచ్చు.

సంకటాలను హరించే ‘సంకటహర గణపతి పూజ’
గణపతి నామాల్లో 'సంకటహరుడు' అనే నామం ప్రత్యేకమైన భరోసాను కలిగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనిశ్చితులు, ఆటంకాల నుంచి బయటపడేందుకు ఆయన అనుగ్రహాన్ని కోరుతూ సంకటహర గణపతి పూజను ఆచరిస్తారు. గణేశ పురాణంలోని ఉపాసనా ఖండంలోద దీనికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. ఈ వైదిక క్రతువులో షోడశోపచారాలతో స్వామివారిని పూజించి, అష్టోత్తర శతనామావళి, గణపతి మంత్రజపం, నైవేద్య సమర్పణతో గణపతిని సేవిస్తారు. గణనాథుని పాదాల చెంత దూర్వలను ఉంచి, మోదకాలను నివేదిస్తారు. ఇవి ఆచారాలు మాత్రమే కాదు.. భక్తి, వినయం, సంపూర్ణ శరణాగతికి ప్రతీకలు. ఈ పూజ ద్వారా వృత్తి జీవితంలోని అవరోధాలు తొలగి పురోగతి కలగాలని, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించాలని, ఆర్థిక ఇబ్బందులు సమసి కుటుంబంలో ప్రశాంతత నెలకొనాలని ప్రార్థించవచ్చు. 
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

నూతన అవకాశాలు

కొత్త వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, శుభకార్యాలకు ఎదురయ్యే విఘ్నాలు తొలగి అనుకూలత కలగాలని వేడుకోవచ్చు.

2

ఆరోగ్య సౌఖ్యం

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత కలగాలని గణనాథుని అనుగ్రహం కోరవచ్చు

3

మనోబల వృద్ధి

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, వివేకం, స్థిరమైన ఆలోచనాశక్తి ప్రసాదించాలని గణపతిని వేడుకోవచ్చు

4

ఆర్థిక స్థిరత్వం

అప్పుల భారం తగ్గి, ఆదాయ వృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక పురోగతి కలగాలని ప్రార్థించవచ్చు

5

కార్యసిద్ధి

ఎంత ప్రయత్నించినా పూర్తికాని పనులు సజావుగా సాగి, చేపట్టిన కార్యాల్లో విజయాలు సిద్ధించాలని ఆరాధన

పూజ ప్రక్రియ

1

గోత్రనామ సంకల్పం

భక్తుల పేరు, గోత్రంతో అభీష్టసిద్ధి కోసం సంకల్పం చేస్తారు.

2

గణపతి ఆవాహన & పూజ

శక్తి గణపతిని ఆవాహన చేసి సంప్రదాయ పద్ధతిలో విశేష పూజ నిర్వహిస్తారు.

3

గణపతి మంత్రజపం & నామస్మరణ

స్వామివారి అనుగ్రహం కోసం గణపతి మంత్రాలను జపిస్తూ, నామస్మరణతో ప్రత్యేక అర్చన నిర్వహిస్తారు.

4

ఋణ విమోచన శక్తి గణపతి హోమం

శాస్త్రోక్త విధానంలో హోమాగ్నికి ఆహుతులు సమర్పిస్తూ స్వామివారిని ఆరాధిస్తారు.

5
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి & మంగళహారతి

పూర్ణాహుతి సమర్పించి, మంగళహారతితో పూజా క్రతువును సంపూర్ణం చేస్తారు.

పూజలో మీకు లభించేవి

మీ నామ, గోత్రాలతో మహాసంకల్పం

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.915K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
రుణ విముక్తి, ధనస్థిరత్వం కోసం రుణ విమోచన శక్తిగణపతి హోమం
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support