క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకం

వివాహ యోగం కోసం తిరుపతి క్షేత్రంలో తులసీ దామోదర కళ్యాణం

  • ధనం & సంపద
  • శీఘ్ర వివాహం
  • వివాహయోగం
పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
21 నవంబర్, శనివారం | కార్తీక మాసం, క్షీరాబ్ది ద్వాదశి
00days:00hrs:00mins:00secs

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

దాంపత్య ఆటంకాలు తొలగి, మీ ఇంట సౌభాగ్యసంపదలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నారా? శ్రీహరి అనుగ్రహం, తులసీదేవి కటాక్షం కోసం ‘సర్వాభీష్ట తులసీ దామోదర కళ్యాణం’లో భాగస్వాములు కండి. తులసీ ఆరాధన హరిభక్తికి, శ్రేయస్సుకు విశేష సాధనమని పురాణాలు కీర్తించాయి. కార్తీక మాసంలో ధాత్రీ వృక్షం నీడన దామోదరుడిని పూజించడం పుణ్యప్రదమని స్కంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యం-12వ అధ్యాయం వర్ణించింది. శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే మహిమాన్విత క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినమైన నవంబర్ 21న ఈ పవిత్ర కళ్యాణ క్రతువును నిర్వహిస్తున్నారు. ఈ దివ్య ఆరాధనలో భాగస్వాములై మీ కుటుంబ శ్రేయస్సు, దాంపత్య అన్యోన్యత, శ్రీహరి కృపాకటాక్షాల కోసం ప్రార్థించవచ్చు. 

క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకం 
ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు, కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటారని పద్మపురాణం వివరిస్తోంది. ఆ మరుసటి ద్వాదశి తిథినే క్షీరాబ్ధి ద్వాదశిగా ఆరాధిస్తారు. క్షీరసాగర మథనంలో మహాలక్ష్మీదేవి ఆవిర్భవించి, శ్రీమహావిష్ణువును తన పతిగా వరించిన దివ్య ఘట్టాన్ని శ్రీమద్భాగవతం(8,8) వర్ణించింది. లక్ష్మీనారాయణుల ఈ దివ్య అనుబంధం ఐశ్వర్యం, సౌభాగ్యం, మంగళానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పవిత్ర పర్వదినాన తులసీదామోదరులను కళ్యాణ విధానంతో ఆరాధిస్తూ దాంపత్య అన్యోన్యత, కుటుంబ శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తారు. కార్తీక మాసంలో తులసీదేవి సన్నిధిలో శ్రీహరిని, ధాత్రీ వృక్షం నీడన దామోదరుడిని ఆరాధించడం విశేష పుణ్యప్రదమని స్కందపురాణం – వైష్ణవఖండం, కార్తీకమాస మహాత్మ్యం పేర్కొంటోంది. 

శ్రీహరికి ప్రియమైన తులసీ మహిమ 
మందార కుంద కురబోత్పల చంపకార్ణ 
పున్నాగ నాగబకులాంబుజ పారిజాతాః 
గంధేఁర్చితే తులసికాభరణేన తస్య 
యస్మింస్తపః సుమనసో బహుమానయంతి 

వైకుంఠంలో సువాసనలు వెదజల్లే దివ్య పుష్పాలెన్ని ఉన్నా.. విష్ణుమూర్తి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాలనే ధరస్తాడని పై శ్లోకం వివరిస్తోంది. తులసి లేనిదే స్వామివారి ఆరాధన సంపూర్ణం కాదని శ్రీమద్భాగవతం(3.15.19) చెబుతోంది. దేవీభాగవతం(9.25) ప్రకారం.. స్వయంగా శ్రీహరే తులసీదేవిని పూజించి, తన వక్షస్థలంపై స్థానం కల్పిస్తానని వరమిచ్చాడు. మరోవైపు స్కందపురాణం–వైష్ణవఖండం, కార్తీకమాస మహాత్మ్యం కూడా తులసీదేవి ఆవిర్భావ గాథను, ఆమెకు శ్రీహరితో ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నాయి. తులసీదళాలతో దామోదరుడిని అర్చించడం కార్తీక మాసంలో విశేష పుణ్యప్రదమని చెబుతున్నాయి.

త్రిమూర్తుల సాన్నిధ్యం.. ధాత్రీ వృక్ష వైభవం 
ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం అంటారు. ‘ధాత్రీ’ అంటే ఆదరించేది అని అర్థం. తల్లిలా సమస్త జీవులను ఆదరించే ప్రకృతి స్వరూపంగా ఈ వృక్షాన్ని పేర్కొన్నారు. స్కందపురాణం ప్రకారం.. సృష్టికి ముందు బ్రహ్మదేవుడు విష్ణువును ధ్యానిస్తూ జపం చేస్తున్న సమయంలో ఆయన కళ్ల నుంచి జాలువారిన బిందువుల నుంచి ఈ వృక్షం ఆవిర్భవించింది. అందుకే ఇది శ్రీహరికి ప్రీతిపాత్రమైన వైష్ణవ వృక్షంగా పూజలందుకుంటుంది. ఈ ఒక్క వృక్షంలోనే త్రిమూర్తులు కొలువై ఉంటారని పురాణ వచనం. త్రిమూర్తుల సాన్నిధ్యాన్ని దర్శించే గొప్ప ఆధ్యాత్మిక భావన ఇందులో అంతర్లీనంగా ఉంది. కార్తీక మాసంలో ఈ వృక్షం నీడన దామోదరుడిని పూజించడం, తులసీదళాలు, ధాత్రీ ఫలాలతో స్వామిని అర్చించడం విశేష పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉసిరి వృక్ష సాక్షిగా నిర్వహించే తులసీదామోదర కళ్యాణంలో భాగస్వాములై అనుగ్రహం కోసం ప్రార్థించవచ్చు. 

అభయహస్తంతో అనుగ్రహించే క్షేత్రం 
తిరుపతి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి క్షేత్రం శ్రీవారి దివ్యకళ్యాణ ఘట్టంతో ముడిపడిన పవిత్ర స్థలం. పద్మావతీదేవిని వివాహమాడిన అనంతరం తిరుమలకు పయనమైన శ్రీనివాసుడు, మార్గమధ్యంలో సిద్ధేశ్వర యోగికి అభయమిచ్చి, రుషులకు దర్శనమిచ్చిన క్షేత్రమిదని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ స్వామివారు అభయహస్తంతో ప్రసన్న వేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. అలాంటి దివ్యక్షేత్రంలో కార్తీక శుక్ల ద్వాదశి పర్వదినాన తులసీదేవి–దామోదరుల కళ్యాణాన్ని ఉసిరి వృక్ష సాక్షిగా నిర్వహించడం విశేష ఆధ్యాత్మిక అనుభూతి. తులసీదేవి భక్తికి, ధాత్రీ వృక్షం పవిత్రతకు, దామోదరుడి దివ్యానుగ్రహానికి ప్రతీకగా ఈ కళ్యాణంలో భాగస్వాములై, మీ కుటుంబానికి సౌభాగ్యం, అన్యోన్యత, శాంతి, శ్రేయస్సు కలగాలని శ్రీహరిని ప్రార్థించండి.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

దాంపత్య అన్యోన్యత

భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర అవగాహన, అనురాగం పెంపొందాలని ప్రార్థించవచ్చు.

2

సౌభాగ్యం

కుటుంబంలో మంగళం, సౌభాగ్యం, శుభప్రదమైన జీవనం కలగాలని కోరవచ్చు.

3

కుటుంబ శ్రేయస్సు

కుటుంబసభ్యుల మధ్య ఐకమత్యం, ప్రశాంతత, పరస్పర ప్రేమ నిలవాలని ప్రార్థించవచ్చు.

4

అష్టైశ్వర్యాలు

శ్రీహరి కృపతో ధనధాన్యాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని కోరవచ్చు.

5

కార్యసిద్ధి

చేపట్టిన పనుల్లో శుభం కలిగి, ప్రయత్నాలు సఫలమవ్వాలని దామోదరుడిని ప్రార్థిస్తారు.

6

హరి అనుగ్రహం

భగవంతుని కటాక్షంతో జీవితంలో ధైర్యం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలని కోరుకుంటారు.

పూజ ప్రక్రియ

1

సంకల్పం & గణపతి పూజ

భక్తుల పేరు, గోత్రంతో సంకల్పం స్వీకరించి, విఘ్న నివారణ కోసం శ్రీ గణపతి పూజతో ఆరాధన ప్రారంభిస్తారు.

2

తులసీదేవి – దామోదర స్వామి ఆవాహన, సంకల్పం

భక్తుల పేరు, గోత్రాలతో సంకల్పం చేసి, తులసీదేవి మరియు దామోదర స్వామివారిని షోడశోపచారాలతో పూజించడం.

3

తులసీ దామోదర కళ్యాణం

ఉసిరి (ధాత్రీ) వృక్ష సాక్షిగా తులసీదేవి, దామోదర స్వామివార్లకు కళ్యాణ విధులు నిర్వహించడం.

4
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, ఆశీర్వచనం

పూర్ణాహుతితో హోమాన్ని ముగించి, భక్తుల శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థిస్తారు

పూజలో మీకు లభించేవి

మీ నామ, గోత్రాలతో మహాసంకల్పం

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి

పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి

ఆంధ్రప్రదేశ్

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
వివాహ యోగం కోసం తిరుపతి క్షేత్రంలో తులసీ దామోదర కళ్యాణం
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support