కార్తీక మాసం ప్రత్యేకం

రామేశ్వరంలో పార్థివ శివలింగాలకు రుద్రాభిషేకం మరియు అఘోర రుద్ర పాశుపత హోమం

  • కుటుంబ శాంతి
  • అపమృత్యు నివారణ
  • ఆర్థిక ఇబ్బందులు
వైదిక యాగశాల, రామేశ్వరం
7 డిసెంబర్, సోమవారం | కార్తీక సోమవారం
00days:00hrs:00mins:00secs

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

కార్తీక సోమవారం.. మాస శివరాత్రి.. ఈ రెండు పర్వదినాలూ వేటికవే పరమశివుడి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవి. అలాంటిది ఈ రెండూ ఒకే రోజున కలిసి రావడం శివారాధనకు అత్యంత పుణ్యప్రదమైన శుభఘడియగా చెబుతారు. ఇంతటి విశేష పర్వదినాన్ని మరింత పుణ్యప్రదంగా మలుస్తూ రామేశ్వర క్షేత్రంలోని వైదిక యాగశాలలో వేదమందిర్ పార్థివ శివలింగాలకు మహా రుద్రాభిషేకంతో పాటు అఘోర రుద్ర పాశుపత హోమాన్ని నిర్వహిస్తోంది. వేదమంత్రాల నడుమ జరిగే ఈ అభిషేకం, హోమం భక్తులకు విశిష్టమైన శివారాధనా భాగ్యాన్ని అందిస్తాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ నామగోత్రాలతో సంకల్పం సమర్పించి, ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, సర్వమంగళాలు కలగాలని పరమశివుడిని ప్రార్థించవచ్చు. 

కార్తీక సోమవారం, మాస శివరాత్రి.. ‘శివభక్తికి శిఖరాయమానం’ 
కార్తీక మాసం అంటేనే శివనామస్మరణ, దీపారాధన. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివభక్తులకు ప్రత్యేకమైనదే. నెలరోజుల పాటు సాగిన ఆరాధనకు చివరి సోమవారం ఓ ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందిస్తుంది. మరోవైపు ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి మంత్రజపాలతో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునే విశిష్ట పర్వదినంగా భావిస్తారు. విడివిడిగానే ఎంతో ప్రాధాన్యమున్న ఈ పర్వదినాలు ఒకే రోజున రావడం మరింత విశేషం. ఈ పవిత్ర సమయాన చేసే శివపూజ ద్వారా మనసులోని కలతలు తొలగి ప్రశాంతత కలగాలని, చాలాకాలంగా ఎదురవుతున్న ఆటంకాలకు పరిష్కారం లభించాలని, ఆరోగ్యం, ఆయుష్షు, కుటుంబ శ్రేయస్సు వృద్ధి చెందాలని భక్తితో సంకల్పించవచ్చు. 

శివానుగ్రహ రక్షాకవచం.. ‘అఘోర రుద్ర పాశుపతి హోమం’ 
పరమశివుడి పంచముఖ స్వరూపాల్లో అఘోరమూర్తి విశిష్టమైనది. భయాలను తొలగించి, భక్తులకు అభయాన్ని ప్రసాదించే రుద్రస్వరూపంగా అఘోరుడిని ఆరాధిస్తారు. పశుపతిగా సమస్త జీవరాశికి అధిపతియైన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ నిర్వహించే ఈ హోమంలో అఘోర రుద్ర మంత్రాలతో అగ్నికి ఆహుతులు సమర్పిస్తారు. లింగపురాణంలోని అఘోరారాధన అధ్యాయం శివుడి అఘోర స్వరూప పూజా విధానాన్ని వివరిస్తుంది. శివపురాణంలోని విద్యేశ్వర సంహితలోనూ పార్థివ లింగ నిర్మాణం, శివావాహనకు అఘోర, తత్పురుష మంత్రాల వినియోగం వివరించబడింది. ఈ పవిత్ర హోమంలో భక్తితో సంకల్పం సమర్పించి, భయాలు, ఆపదలు, ఆటంకాల నుంచి రక్షణతో పాటు ఆరోగ్యం, ఆయుష్షు, మనోధైర్యం, సర్వశ్రేయస్సు కలగాలని పశుపతినాథుడిని ప్రార్థించవచ్చు. 

భూమిపై సాక్షాత్తూ శివస్వరూప ఆరాధన 
మట్టితో చేతులారా రూపొందించే శివలింగాలను పార్థివ లింగాలు అంటారు. పంచభూతాల్లో ఒకటైన భూమి తత్త్వంతో శివస్వరూపాన్ని రూపొందించి, మంత్రోచ్ఛారణల మధ్య పరమేశ్వరుడిని ఆవాహన చేసి పూజించడం ఈ ఆరాధనలోని విశిష్టత. మట్టితో లింగాన్ని రూపొందించడం నుంచి అభిషేకం, పుష్పార్చన, బిల్వదళ సమర్పణ వరకు ప్రతి అడుగులోనూ భక్తుడి శ్రద్ధ, వినయం, శివభక్తి వ్యక్తమవుతాయి. ఇలా పార్థివ లింగాన్ని శివస్వరూపంగా భావించి ఆరాధించడం ద్వారా భక్తుడు తన మనసును పరమేశ్వరుడిపై లగ్నం చేస్తాడు. ఈ పూజలో ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం, భూమి లేదా ఆస్తికి సంబంధించిన కార్యాల సాఫల్యం కలగాలని సంకల్పించుకోవచ్చు. 

అపమృత్యు భయాలు తొలగించే ‘రుద్రాభిషేకం’ 
పరమశివుడిని ప్రసన్నం చేసుకునే పవిత్ర ఆరాధనల్లో రుద్రాభిషేకానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీరుద్రంలోని నమకం, చమకం మంత్రాలను పఠిస్తూ శివలింగానికి అభిషేకం చేస్తారు. నమకంలో రుద్రుడి రూపాలను స్తుతిస్తూ, చమకంలో జీవనానికి అవసరమైన ఆరోగ్యం, శక్తి, పోషణ, శ్రేయస్సు, సంపద, సంతృప్తి వంటి అనుగ్రహాలను ప్రార్థిస్తారు. ఈ మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. బిల్వదళాలతో అర్చిస్తూ శివుడిని కొలుస్తారు. అంతటి పవిత్ర శ్రీరుద్ర మంత్రాల నడుమ పార్థివ శివలింగాలకు జరిగే ఈ మహా రుద్రాభిషేకంలో మీ నామగోత్రాలతో సంకల్పం సమర్పించుకోవడం ద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆయుష్షు, మానసిక ప్రశాంతత, ఆర్థిక శ్రేయస్సు, కుటుంబ ఐకమత్యం, సర్వవిధ శుభాలు కలగాలని ప్రార్థించవచ్చు.  
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

అపమృత్యు భయాల నివారణ

అకాల మృత్యుభయాలు, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి రక్షణ కలిగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మహాదేవుడిని ప్రార్థించవచ్చు.

2

ఆరోగ్య భాగ్యం

దీర్ఘకాలిక అనారోగ్య బాధలు, శారీరక ఇబ్బందులు తొలగి.. శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత, జీవితానికి నూతనోత్సాహం కలగాలని సంకల్పించవచ్చు.

3

ధనస్థిరత్వం

ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు, ధననష్టాలు తొలగి.. సంపాదించిన సంపద నిలవాలని, ఆదాయం వృద్ధి చెంది ఐశ్వర్యం సమకూరాలని ప్రార్థించవచ్చు.

4

కుటుంబ సౌఖ్యం

కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు తొలగి.. దంపతుల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి సుఖశాంతులు నెలకొనాలని కోరుకోవచ్చు.

5

కార్యసిద్ధి

ఎంత ప్రయత్నించినా పూర్తికాని పనులు సఫలమై, దీర్ఘకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగి.. వృత్తి, వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధి సాధించాలని సంకల్పించవచ్చు.

పూజ ప్రక్రియ

1

శ్రీ గణపతి ఆరాధన

విఘ్నాలు తొలగి పూజ నిర్విఘ్నంగా, శుభప్రదంగా సాగాలని గణపతిని ప్రార్థిస్తారు.

2

మహాసంకల్పం

పూజా ప్రాంగణాన్ని పవిత్రం చేసి, భక్తుల నామగోత్రాలతో ఆయురారోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేస్తారు.

3

అర్చన

ట్టితో రూపొందించిన పార్థివ శివలింగాలను శివస్వరూపాలుగా భావించి, విధివిధానాలతో పూజిస్తారు.

4

మహా రుద్రాభిషేకం

నమక, చమక మంత్రోచ్ఛారణల నడుమ 1,116 శివలింగాలకు అభిషేకం నిర్వహిస్తారు.

5
✦ ప్రధాన పూజా విధి

అఘోర రుద్ర పాశుపత హోమం

అఘోర రుద్ర మంత్రాలను పఠిస్తూ, వైదిక విధానంలో పవిత్ర హోమాగ్నికి ఆహుతులు సమర్పించి పరమశివుడిని ఆరాధిస్తారు.

పూజలో మీకు లభించేవి

పార్థివ శివలింగాల మహా రుద్రాభిషేకం

శ్రీరుద్ర నమక, చమక పారాయణం

మీ నామగోత్రాలతో మహాసంకల్పం

వేదమంత్రాలతో శాస్త్రోక్త పూజ

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల

రామేశ్వరం

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
రామేశ్వరంలో పార్థివ శివలింగాలకు రుద్రాభిషేకం మరియు అఘోర రుద్ర పాశుపత హోమం
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support