రాహు కేతు గోచార ప్రత్యేకం

రాహుకాల ప్రత్యేక రాహుకేతు శాంతి హోమం - మీ గోత్రనామాలతో!

  • కాలసర్ప దోషం
  • రాహు దోషం
  • శని దోషం
బటుక భైరవ సోమేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి క్షేత్రం
5 డిసెంబర్, శనివారం | రాహు కేతు గోచారం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

గ్రహాల స్థానాలు మారినప్పుడు జీవితంలో కొత్త పరిణామాలకు సమయం ఆసన్నమవుతుంది. ఇప్పుడు అలాంటి ఓ కీలక ఘడియ రాబోతోంది. 18 సంవత్సరాల తర్వాత 2026 డిసెంబర్ 5న రాహువు కుంభరాశి నుంచి మకరరాశిలోకి, కేతువు సింహరాశి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశించనున్నారు. జీవిత గమనంపై ప్రభావం చూపగల ఈ కీలక పరిణామాన్నే ‘రాహు–కేతువుల గోచారం’గా పిలుస్తారు. జ్యోతిష్యపరంగా అత్యంత కీలకమైన ఈ గ్రహ సంచారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం, వాటి అనుకూలత కోసం గ్రహశాంతి ఆరాధన చేయడం ముఖ్యమని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు. అందుకే శ్రీకాళహస్తిలోని బటుకభైరవ సోమేశ్వర ఆలయంలో కాలసర్ప దోష నివారణ మరియు రాహుకేతు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. రాబోయే గ్రహమార్పు వేళ దైవసన్నిధిలో ప్రార్థించి, రాహు–కేతువుల అనుగ్రహం కోసం ప్రార్థించండి. 

రాహు–కేతువుల గోచార రహస్యం 
భౌతిక గ్రహాలు కాకపోయినా జ్యోతిష్యంలో రాహు, కేతువులకు విశిష్ట స్థానం ఉంది. రాహువు కోరికలు, ఆశయాలు, భౌతిక ఆకాంక్షలకు సంకేతమైతే.. కేతువు వైరాగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక. ఎప్పుడూ పరస్పరం 180 డిగ్రీల వ్యత్యాసంతో సంచరించే ఈ ఛాయాగ్రహాల రాశి మార్పు జీవితంలోని పలు రంగాలపై ప్రభావం చూపగల కీలక గోచారంగా భావిస్తారు. ఈసారి రాహువు శని అధిపత్యంలోని మకరరాశిలోకి, కేతువు చంద్రుడి అధిపత్యంలోని కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్మ , బాధ్యతలకు శని.. మనసు, కుటుంబ సౌఖ్యానికి చంద్రుడు కారకులు. ఇలాంటి గ్రహమార్పు వేళ రాహు–కేతువుల అనుకూలత కోసం దైవశరణు కోరుతూ గ్రహశాంతి ఆరాధన చేయడం విశేషమని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాలసర్ప దోష నివారణ, రాహుకేతు శాంతి హోమం ద్వారా గ్రహబాధల శాంతి, కుటుంబ సౌఖ్యం, వృత్తి అభివృద్ధి, మనోస్థైర్యం కోసం స్వామివారి అనుగ్రహాన్ని ప్రార్థించవచ్చు. 

ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం 
ఈ గోచారంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
  • మేషరాశి: రాహువు 10వ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో కొత్త అవకాశాలు, మార్పులను పరిశీలించాలి. కేతువు 4వ స్థానంలో ఉండటం వల్ల గృహసుఖం, కుటుంబ వాతావరణంపై శ్రద్ధ అవసరం.
  • మిథునరాశి: రాహువు 8వ స్థానంలోకి, కేతువు 2వ స్థానంలోకి రావడం వల్ల ఆకస్మిక పరిణామాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా పరిశీలించాలి.
  • కర్కాటకరాశి: రాహువు 7వ స్థానంలోకి, కేతువు జన్మరాశిలోకి రావడం వల్ల వివాహం, భాగస్వామ్యాలు, వ్యక్తిగత నిర్ణయాలు ముఖ్యమవుతాయి.
  • తులారాశి: రాహువు 4వ స్థానంలోకి, కేతువు 10వ స్థానంలోకి రావడం వల్ల ఇల్లు, ఆస్తులు, ఉద్యోగం, వృత్తిపరమైన లక్ష్యాల విషయంలో మార్పులను పరిశీలించాలి.
  • మకరరాశి: రాహువు జన్మరాశిలోకి, కేతువు 7వ స్థానంలోకి రావడం వల్ల వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య అలవాట్లు, వైవాహిక మరియు భాగస్వామ్య సంబంధాలపై శ్రద్ధ అవసరం.

కాలసర్ప దోష ప్రభావాల నుంచి విముక్తి 
జాతకంలో రాహువు, కేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు ఒకవైపు ఉన్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఇది 12 రకాలుగా ఉంటుంది. అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, ఘాతక, విషధర, శేషనాగ అనే ఈ యోగాలు జాతక చక్రంలో ఏర్పడిన స్థానాన్ని బట్టి విభిన్న స్వభావాలను కలిగి ఉంటాయి. ఒక్కో యోగానికి రాహు–కేతువుల స్థానం, వాటి మధ్య గ్రహాల అమరిక ఆధారంగా పేరు ఏర్పడుతుంది. జ్యోతిష్య విశ్లేషణలో వీటిని వివాహంలో జాప్యం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఆర్థిక ఒడిదుడుకులు, సంతాన సంబంధిత ఆందోళనలు వంటి సమస్యలతో అనుసంధానిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలసర్ప యోగ శాంతికి నాగదేవతల ఆరాధన, రాహు–కేతు పూజలు, హోమాలు నిర్వహించడం శాస్త్రోక్త పరిహార మార్గంగా భావిస్తారు. 

గ్రహబాధల శాంతికి శాస్త్రోక్త హోమం 
కాలసర్ప దోష నివారణ, రాహుకేతు శాంతి హోమాలు నిర్ణీత వైదిక విధానంలో నిర్వహిస్తారు. ముందుగా విఘ్నాలు తొలగాలని గణపతి పూజ, పూజా ప్రదేశ పవిత్రత కోసం పుణ్యాహవాచనం చేస్తారు. అనంతరం కలశ స్థాపన చేసి, భక్తుల గోత్రనామాలు, జన్మనక్షత్రం, రాశి వివరాలతో సంకల్పం చెబుతారు. ఆ తర్వాత రాహు–కేతువులకు ఆవాహన, అర్చన, ప్రత్యేక మంత్రజపాలు నిర్వహిస్తారు. కాలసర్ప దోష నివారణలో భాగంగా నాగదేవతలను కూడా ఆరాధించి, వారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. చివరగా వైదిక మంత్రోచ్ఛారణల మధ్య హోమాగ్నికి నిర్ణీత ఆహుతులు సమర్పించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ మొత్తం పూజా క్రమంలో గ్రహశాంతి, కాలసర్ప యోగ శాంతి, నాగదేవతల అనుగ్రహం కోసం భక్తులు తమ గోత్రనామాలతో సంకల్పం చేసుకుంటారు. 

ఆపదల నుంచి రక్షణ కోసం.. శ్రీకాళహస్తిలో హోమం 
రాహు–కేతు ఆరాధనకు ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహశాంతి కోసం స్వామివార్లను ఆశ్రయించడం గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఇక్కడ కొలువైన బటుకభైరవ స్వామి రక్షణను వేడుకుంటూ, సోమేశ్వర స్వామి చల్లని కరుణ కోసం ప్రార్థిస్తూ కాలసర్ప దోష నివారణ, రాహుకేతు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఈసారి కేతువు చంద్రుడి అధిపత్యంలోని కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న వేళ సోమేశ్వరుని సన్నిధిలో గ్రహశాంతి సంకల్పం చేసుకోవడం మరింత విశేషం. వేదమందిర్ ద్వారా మీ గోత్రనామాలతో ఈ హోమంలో భాగస్వాములు కావచ్చు. మీరు ఆలయానికి రాలేకపోయినా, మీ తరఫున పండితులు సంకల్పంతో హోమాన్ని నిర్వహిస్తారు. రాబోయే గ్రహమార్పు ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొంది, బటుకభైరవ, సోమేశ్వర స్వాముల దివ్య అనుగ్రహం కలగాలని ఈ పవిత్ర హోమంలో సంకల్పం చేసుకోండి.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

కాలసర్ప దోష శాంతి

జాతకంలోని కాలసర్ప యోగం వల్ల ఎదురవుతున్నాయని భావించే ఆటంకాలు, జాప్యాల నుంచి ఉపశమనం కోసం ప్రార్థించవచ్చు.

2

మనోస్థైర్యం, గ్రహబాధల శాంతి

అనవసర భయాలు, మానసిక ఆందోళనలు తొలగి, మనసుకు ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలగాలని సంకల్పించవచ్చు.

3

వివాహ ప్రాప్తి, దాంపత్య సౌఖ్యం

వివాహ ప్రయత్నాల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగాలని, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని సంకల్పించవచ్చు.

4

వృత్తి, ఆర్థిక స్థిరత్వం

ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే ఒడిదుడుకులు తగ్గి, వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కలగాలని రాహు–కేతువుల అనుగ్రహాన్ని కోరుకోవచ్చు.

5

కుటుంబ క్షేమం, సంతాన సౌభాగ్యం

కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, సంతాన సంబంధిత ఆందోళనలు తొలగి శుభపరిణామాలకై నాగదేవతల ఆరాధన.

పూజ ప్రక్రియ

1

విఘ్నేశ్వర పూజ - సంకల్పం

గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన నిర్వహించి భక్తుల గోత్రనామాలు, జన్మనక్షత్రం, రాశులతో గ్రహశాంతి సంకల్పం చేస్తారు.

2

రాహు-కేతు గ్రహారాధన

రాహు, కేతు గ్రహాలకు ఆవాహన, అర్చన, ప్రత్యేక మంత్రజపాలు నిర్వహించి వాటి అనుకూలత, గ్రహశాంతి కోసం ప్రార్థిస్తారు.

3

నాగదేవతల ఆరాధన

కాలసర్ప యోగ శాంతి కోసం నాగదేవతలను పూజించి, వారి అనుగ్రహం, కుటుంబ క్షేమం కోసం సంకల్పం చేస్తారు.

4
✦ ప్రధాన పూజా విధి

రాహుకేతు శాంతి హోమం

వైదిక మంత్రోచ్ఛారణల మధ్య హోమాగ్నికి ఆహుతులు సమర్పించి, పూర్ణాహుతితో గ్రహశాంతి క్రతువును పూర్తి చేస్తారు.

పూజలో మీకు లభించేవి

గోత్రనామాలతో పూజా సంకల్పం.

రాహు, కేతు గ్రహశాంతి పూజలో భాగస్వామ్యం.

కాలసర్ప దోష నివారణ హోమంలో భాగస్వామ్యం.

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

బటుక భైరవ సోమేశ్వర ఆలయం

శ్రీకాళహస్తి క్షేత్రం

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
రాహుకాల ప్రత్యేక రాహుకేతు శాంతి హోమం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support