మనిషికి ఏ దిక్కు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. కొన్నిసార్లు సమస్యలు శత్రువుల రూపంలో ఎదురవుతాయి. మరికొన్నిసార్లు నరదృష్టి, అసూయ, అనుకోని ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యల రూపంలో వెంటాడుతాయి. కనిపించే సమస్యలే కాదు.. భవిష్యత్తు గురించి తెలియని భయం, అభద్రతాభావం కూడా మనిషిని కుంగదీస్తాయి. ఇలాంటి ఆపదల నుంచి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ, అష్టభైరవులను ఒకేసారి ఆవాహన చేసి నిర్వహించే ఆరాధనే ‘శ్రీ అష్టభైరవ ఆపదుద్ధారణ రక్షా హోమం’. దీనికి తోడు కాలభైరవుడిని కూష్మాండ దీపంతో ఆరాధించడం వల్ల దృష్టి దోషాలు, ప్రతికూలతలు తొలగి సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు. ఈ రెండు విశేష ఆరాధనలను డిసెంబర్ 1న ‘కాలభైరవ జయంతి’ సందర్భంగా వేదమందిర్ నిర్వహిస్తోంది. ఇందులో భాగస్వాములై మీ సకల సమస్యల పరిష్కారం కోసం సంకల్పించవచ్చు.
అజ్ఞాత భయాలను తొలగించే ‘కాలభైరవుడు’
సమయానికీ, మృత్యువుకీ అధిపతిగా ఆరాధించబడే దైవం కాలభైరవుడు. శివుడి ఉగ్రరూపంగా ఆవిర్భవించిన ఆయనను కాలాన్ని శాసించే మహాశక్తిగా, కాశీ క్షేత్రపాలకుడిగా కొలుస్తారు. పురాణ కథనం ప్రకారం.. బ్రహ్మదేవుడి అహంకారాన్ని అణచడానికి ఆవిర్భవించిన కాలభైరవుడు ఆయన ఐదో తలను చేతి గోటితో ఖండించి, బ్రహ్మహత్యా పాతక విముక్తి కోసం కాశీకి చేరుకున్నాడు. శివాజ్ఞతో అక్కడ క్షేత్రపాలకుడిగా అభయమిస్తున్నాడని విశ్వాసం. మనిషిని వెంటాడే కాలభయం, మృత్యుభయం, భవిష్యత్తుపై ఆందోళనలకు కూడా అధిపతిగా భావించే కాలభైరవుడిని ఆరాధించడం ద్వారా వాటిని అధిగమించే ధైర్యం, ఆపదలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం లభిస్తాయని, జాతక దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. అందుకే ‘కాలభైరవ జయంతి’ రోజున ఆయనను ఆరాధించడం విశేషమైన అవకాశం.
దృష్టి దోషాలకు పరిహారం కోసం ‘కూష్మాండ దీపం’
ఇతరుల అసూయ, నరదృష్టి వల్ల కలిగే ఆటంకాలు తొలగి సకల శుభాలు కలగాలని చేసే విశేష ఆరాధనే ‘కూష్మాండ దీపపూజ’. సాధారణ దీపారాధనకు భిన్నంగా గుమ్మడికాయనే దీపపాత్రగా ఉపయోగిస్తూ కాలభైరవుడిని ఆరాధించడం దీని ప్రత్యేకత. ప్రాచీన ఆచారాల్లో ఉగ్రదేవతల ఆరాధనలో బలికి ప్రత్యామ్నాయంగా కూష్మాండాన్ని సాత్విక సమర్పణగా ఉపయోగించే పద్ధతి ఉంది. అందుకే దీనిని ప్రతికూలతల తొలగింపునకు ప్రతీకగా భావిస్తారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే అగ్నిస్వరూపుడిగా ఆరాధించే కాలభైరవుడి సన్నిధిలో ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా నరదృష్టి, అసూయ, ప్రతికూల ప్రభావాలు తొలగి మనశ్శాంతి, కుటుంబ శుభం కలగాలని ప్రార్థిస్తారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సానుకూల వాతావరణం నెలకొనాలని, అనారోగ్యాలు, ఆర్థిక ఆటంకాలు, అనుకోని ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగాలని కోరుకునేవారికి ఈ పూజ విశేషమైనది.
అష్టదిక్కుల అధిపతులు.. అష్టభైరవులు!
పరమశివుడి ఉగ్రరూపమైన కాలభైరవుడి 8 ప్రధాన స్వరూపాలనే అష్టభైరవులు అంటారు. వీరిని 8 దిక్కులకు రక్షకులుగా కొలుస్తారు. అష్టదిక్కులలోని ప్రతికూల శక్తులను అణచి, ధర్మాన్ని కాపాడే దైవిక శక్తులుగా వీరిని ఆరాధిస్తారు. కొన్ని పురాణ, ఉపాసనా కథనాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసుల సంహారంతో భైరవ స్వరూపాలను అనుసంధానించే గాథలు కనిపిస్తాయి.
భైరవుని పేరు - తత్వం
- అసితాంగ భైరవుడు(తూర్పు) - సృజనాత్మకత, జ్ఞానం, స్పష్టత
- రురు భైరవుడు(ఆగ్నేయం) - విద్య, కళలు, సంపద
- చండ భైరవుడు(దక్షిణం) - శక్తి, ధైర్యం, శత్రు జయం
- క్రోధ భైరవుడు(నైరుతి) - చెడుపై విజయం, దృఢ నిర్ణయాలు
- ఉన్మత్త భైరవుడు(పశ్చిమం) - అహంకార నాశనం, ఆనందం
- కపాల భైరవుడు(వాయువ్యం) - కర్మ ఫలం, సత్కార్యాల రక్షణ
- భీషణ భైరవుడు(ఉత్తరం) - భయ నివారణ, దుష్ట శక్తుల నాశనం
- సంహార భైరవుడు(ఈశాన్యం) - పాప క్షాళన, మోక్ష మార్గం
ఆపదల నుంచి ఉద్ధరించే ‘అష్టభైరవ ఆపదుద్ధారణ రక్షా హోమం’
జీవితంలో ఎదురయ్యే శత్రుబాధలు, కుట్రలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, వ్యాపార నష్టాలు, ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు, రాహు, కేతు, శని గ్రహ సంబంధిత సమస్యలు, ప్రమాదాలు, అకాల మృత్యుభయాలు మనిషిని కలవరపెడుతుంటాయి. ఇలాంటి ఆపదల నుంచి రక్షణ కోరుతూ అష్టభైరవులను ఏకకాలంలో ప్రార్థించే విశేష ఆరాధనే ‘శ్రీ అష్టభైరవ ఆపదుద్ధారణ రక్షా హోమం’. ఈ హోమంలో అష్టభైరవులను వేర్వేరు స్వరూపాలుగా హోమగుండంలో ఆవాహన చేస్తారు. ఒక్కో భైరవ స్వరూపానికి నిర్దేశించిన బీజమంత్రాలు, మూలమంత్రాలను శాస్త్రోక్తంగా జపిస్తూ నువ్వులు, ఆవాలు, నెయ్యి, సమిధలు తదితర హోమద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తారు. ప్రతి మంత్రోచ్చారణకు అనుగుణంగా చేసే ఆహుతులతో అష్టభైరవుల అనుగ్రహాన్ని ప్రార్థిస్తారు. 8 భైరవ శక్తులనూ ఒకే హోమంలో ఆరాధించడం ద్వారా సమస్త ఆపదల నుంచి రక్షణ, శత్రువులపై విజయం, జీవితంలోని ఆటంకాల నుంచి విముక్తి కలగాలని సంకల్పిస్తారు.
కాలభైరవ జయంతి, మంగళవారం.. అరుదైన ఆరాధనా అవకాశం!
కాలభైరవ జయంతి, కుజుడికి అధిపత్యం కలిగిన మంగళవారం.. ఈ రెండు విశేషాలు కలిసివచ్చిన డిసెంబర్ 1వ తేదీ భైరవారాధనకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ పర్వదినాన కాలభైరవుడికి రెండు విశేష ఆరాధనలు నిర్వహించడం మరో ప్రత్యేకత. ఓవైపు కూష్మాండ దీపపూజతో నరదృష్టి, అసూయ, ప్రతికూలతల నుంచి ఉపశమనం కోరుతూ.. మరోవైపు అష్టదిక్కుల రక్షకులైన 8 భైరవ స్వరూపాలను ఆవాహన చేసే ‘అష్టభైరవ ఆపదుద్ధారణ రక్షా హోమం’తో సకల ఆపదల నుంచి రక్షణ వేడుకోవచ్చు. మంగళవారం భైరవుడిని ఆరాధించడం వల్ల ధైర్యం, శత్రుజయం, కుజదోష నివారణ, వివాహ ఆటంకాల తొలగింపు కలుగుతాయని విశ్వాసం. వేదమందిర్ నిర్వహిస్తున్న ఈ విశేష ఆరాధనలో మీ గోత్రనామాలతో సంకల్పం చేయించుకుని కుటుంబ క్షేమం, ఆయురారోగ్యాలు, సకల ఆపదల నుంచి రక్షణ కోసం స్వామి అనుగ్రహాన్ని పొందండి.
కష్టాలు, భయాలు, ఆర్థిక ఆటంకాలకు స్వస్తి పలికడానికి ఇప్పుడే సంకల్పించండి! కాలభైరవుడి దివ్య రక్షను మీ కుటుంబానికి కోరుతూ డిసెంబర్ 1న జరిగే కూష్మాండ దీపపూజ, అష్టభైరవ ఆపదుద్ధారణ రక్షా హోమంలో గోత్రనామాలతో సంకల్పం చేయించుకోండి.