అమావాస్య ప్రత్యేకం

ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమం - మీ గోత్రనామాలతో!

  • వృత్తి & ఉద్యోగ అభివృద్ధి
  • కుటుంబ శాంతి
  • దృష్టిదోషం నుంచి ఉపశమనం
వైదిక యాగశాల, హైదరాబాద్, తెలంగాణ
8 డిసెంబర్, మంగళవారం | ఆమావాస్య ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

ఎదురులేని శక్తి.. తిరుగులేని రక్షణ.. శరణు కోరిన భక్తులకు అభయమిచ్చే మహాశక్తిగా ‘శ్రీ ప్రత్యంగిరా దేవి’ ఆరాధింపబడుతుంది. శరభేశ్వరుడి ఆవిర్భావ గాథతో ముడిపడిన అమ్మవారి శక్తిస్వరూపం.. అథర్వణ భద్రకాళిగా ఆమె ఉగ్రతేజస్సు.. ప్రత్యంగిరా దేవి ఉపాసనకు ప్రత్యేకతను చేకూరుస్తాయి. మహాకాళి, చండీ, ప్రత్యంగిరా అమ్మవార్ల ఆరాధనకు ప్రశస్తమైన అమావాస్య నాడు.. వేదమందిర్ ఆధ్వర్యంలో ‘అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమం’ నిర్వహిస్తున్నారు. మంత్రఘోషల మధ్య హోమాగ్నికి ఆహుతులు సమర్పిస్తూ.. నరదృష్టి, శత్రుబాధలు, ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలని ఈ ఆరాధనతో అమ్మవారిని ప్రార్థించవచ్చు. ఆ తల్లి రక్షణలో మీ సంకల్పాలకు బలం చేకూర్చుకోండి!

దుష్టశక్తుల నుంచి దివ్యరక్షణ 
సింహముఖం, అగ్నితేజస్సుతో విరాజిల్లే ప్రత్యంగిరా దేవిని ‘అథర్వణ భద్రకాళి’గా ఆరాధిస్తారు. సింహం ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక కాగా.. అమ్మవారి ఉగ్రరూపం అధర్మాన్ని, దుష్టత్వాన్ని అణచే శక్తిని సూచిస్తుంది. ఉగ్రరూపిణిగానే కాకుండా, శరణు కోరిన భక్తులకు అభయమిచ్చే కరుణామయి తల్లిగా కూడా అమ్మవారిని కొలుస్తారు. అథర్వణ సంప్రదాయంతో అనుసంధానమైన మంత్రోపాసనలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో వేడుకుంటే నరదృష్టి, ప్రతికూల శక్తుల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. 

ఎంతటి భయాన్నైనా జయించే ఆత్మబలం.. 
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహుడి కోపం తగ్గకపోవడంతో శివుడు శరభేశ్వరుడిగా వచ్చాడని శైవ సంప్రదాయ గాథలు చెబుతాయి. ఆ శరభేశ్వరుడి శక్తి నుంచే ప్రత్యంగిరా దేవి ఆవిర్భవించి, నరసింహుడిని శాంతింపజేసినట్లు ప్రతీతి. శరభేశ్వరుడితో ప్రత్యంగిరా దేవి అనుబంధాన్ని శరభోపాసనా సంప్రదాయాలు, ప్రత్యంగిరా స్తోత్ర కథనాలు ప్రస్తావిస్తాయి. ఉగ్రత్వం వెనుక ఉన్నది ధర్మరక్షణే అని.. ఆ ఉగ్రశక్తిని శాంతింపజేసేది పరాశక్తి కరుణే అనే సత్యాన్ని ఈ గాథ చాటుతుంది. అందుకే ప్రత్యంగిరా దేవిని స్మరిస్తూ.. భయాలు, ప్రతికూల ప్రభావాలు తొలగి, ధైర్యం, మనోబలం, దైవ రక్షణ కలగాలని వేడుకుంటారు. 

ప్రతికూల శక్తులను తిప్పికొట్టే మహాశక్తి 
ప్రత్యంగిరా దేవి ఉపాసనలో ప్రధానంగా దుష్టశక్తుల నివారణ అనే భావనలు కనిపిస్తాయి. తిప్పికొట్టే అనే అర్థం వచ్చే ‘ప్రతి’ అనే పదాన్ని, అంగిరస మహర్షి పేరు ‘అంగిరా’తో అనుసంధానించి.. హానికరమైన శక్తులను తిప్పికొట్టే మహాశక్తిగా అమ్మవారిని కొలుస్తారు. అందుకే శాపాలు, నరదృష్టి వంటి భయాల నుంచి విముక్తి కోరుతూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇతరుల నుంచి ఎదురయ్యే అన్యాయాలు, శత్రుత్వం, అసూయ వంటి ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించడానికి అమ్మవారి అనుగ్రహాన్ని వేడుకుంటారు. ఈ ఆరాధనతో ధర్మబద్ధంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి లభించాలని సంకల్పిస్తారు. 

అమావాస్య ఆరాధన.. ఎందుకంత విశేషం? 
జ్యోతిష్యశాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. ఈ తిథిని అంతర్ముఖ చింతన, ఆధ్యాత్మిక సాధన, శక్తి ఉపాసనలకు విశేష సమయంగా పరిగణిస్తారు. ఈ తిథిని శక్తి ఆరాధనకు విశేషమైన సమయంగా భావిస్తారు. అందుకే భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగి.. ధైర్యం, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరగాలని అమ్మవారిని ప్రార్థించవచ్చు. చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే అమ్మవారి దివ్యశక్తిని స్మరిస్తూ.. ఈ అమావాస్య రోజున నిర్వహించే ప్రత్యంగిరా హోమంలో భాగస్వాములై, అమ్మవారి అనుగ్రహంతో ధైర్యం కలగాలని ప్రార్థించవచ్చు. 

సంపూర్ణ క్షేమం కోసం ‘ప్రత్యంగిరా హోమం’ 
అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమంలో అగ్నిహోమం ద్వారా అమ్మవారిని ఆవాహన చేసి, మంత్రోచ్ఛారణలు, హోమాహుతులతో ఆ తల్లి శక్తిని స్తుతిస్తారు. ప్రత్యంగిరా మాత రక్షణను కోరుతూ సమర్పించే ప్రతి ఆహుతి భక్తుల శుభసంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. అనారోగ్య బాధలు తొలగి, ఆరోగ్యం కుదుటపడి, కుటుంబీకులకు ఆయురారోగ్యాలు, సంపూర్ణ క్షేమం కలగాలని ఈ ఆరాధన ద్వారా ప్రార్థించవచ్చు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యం, ప్రశాంతత ప్రసాదించాలని ఆ తల్లి చరణాలను శరణు వేడుకోవచ్చు.

భక్తితో శరణు వేడితే.. అభయమిచ్చే అమ్మవారు 
ప్రత్యంగిరా దేవి ఉగ్రరూపం వెనకున్న పరమార్థం అధర్మాన్ని అంతమొందించి, ధర్మాన్ని పరిరక్షించడమే. ఇతరులను ద్వేషంతో కాకుండా, జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే, జగన్మాత తప్పక అనుగ్రహిస్తుందని శాస్త్రవచనం. ఈ దివ్య ఆరాధనతో మనసులోని అభద్రతాభావం, ఆందోళనలు తొలగి.. జీవితంలో స్థిరత్వం, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. భయాలు వీడి, అఖండ ధైర్యంతో మీ కుటుంబం ఆ తల్లి కరుణాకవచంలో సురక్షితంగా ఉండాలని కోరుతూ.. ఇప్పుడే ఈ మహాహోమంలో మీ సంకల్పాన్ని జతచేయండి!
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

దుష్టశక్తుల నివారణ

నరదృష్టి, ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కలగాలని ప్రార్థించవచ్చు.

2

శత్రు భయ నిర్మూలన

న్యాయపరమైన చిక్కులు, అనవసర శత్రు బాధలు, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి సంకల్పం.

3

మానసిక ధైర్యం & ఆరోగ్యం

అంతుచిక్కని అనారోగ్యాలు, భయాలు, మానసిక అశాంతి తొలగి ఆత్మవిశ్వాసం పెరగే శక్తి కోసం ప్రార్థించవచ్చు.

4

సకల కార్యసిద్ధి

ఆటంకాలు తొలగి వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి సాధించే మార్గం పొందడానికి ప్రార్థన.

5

ఆకస్మిక ఆపదల నుంచి రక్షణ

ఊహించని విపత్తులు, ప్రమాదాలు, తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి క్షేమం కోసం అమ్మవారి అభయాన్ని కోరుకోవడానికి.

పూజ ప్రక్రియ

1

మహాసంకల్పం

భక్తుల పేర్లు, గోత్రాలతో అమ్మవారి సన్నిధిలో మహాసంకల్పం.

2

దేవతా ఆవాహన

అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా దేవిని భక్తిపూర్వకంగా ఆవాహన.

3

మంత్రోపాసన

ప్రత్యంగిరా దేవి మంత్రాలతో విశేష పూజ, అర్చన.

4

హోమాహుతులు

వేదమంత్రాల నడుమ హోమాగ్నికి ప్రత్యేక ద్రవ్యాలతో ఆహుతుల సమర్పణ.

5
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి

లోకక్షేమం, కుటుంబ శాంతి, భక్తుల శుభసంకల్పాల నెరవేర్పు కోసం ప్రార్థన.

పూజలో మీకు లభించేవి

మీ పేరు, గోత్రంతో మహాసంకల్పం

మీ సంకల్పంతో ప్రత్యేక హోమాహుతులు

దుష్టశక్తుల నివారణకు ప్రార్థన

కుటుంబ క్షేమం కోసం ప్రత్యేక సంకల్పం

పూజ పూర్తి వీడియో మీ వాట్సాప్‌కు

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా హోమం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support