శని ప్రదోష కాలం ప్రత్యేకం

8 కిలోల నువ్వులతో శని పాశుపత హోమం మరియు రుద్రాభిషేకం - మీ గోత్రనామాలతో!

  • శని దోషం
  • జాతకంలో గ్రహ దోష నివారణ
  • శీఘ్ర వివాహం
వైదిక యాగశాల, హైదరాబాద్, తెలంగాణ
5 డిసెంబర్, శనివారం | శని త్రయోదశి, శని ప్రదోష కాలం ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

శివుడి కరుణాకటాక్షం.. శనిదేవుడి అనుగ్రహం.. ఈ రెండు దివ్యశక్తుల ఆరాధనకు ఒకే పర్వదినం వేదిక కాబోతోంది! శివారాధనకు శ్రేష్టమైన త్రయోదశి తిథి.. ఆ తిథిలో వచ్చే పవిత్ర ప్రదోషకాలం.. ఈ రెండూ శనివారంతో కలిసి వస్తున్నాయి. ఈ విశిష్ట తిథి, వారాల కలయిక అయిన ‘శని ప్రదోష’ వేళ శివశనులను ఏకకాలంలో ఆరాధించడం పుణ్యఫలదాయకం. ఈశ్వరుడి కరుణాకటాక్షాలతో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రార్థించడానికి ఇదే మహత్తర తరుణమని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ డిసెంబర్ 5వ తేదీన 8 కిలోల నువ్వులతో శని పాశుపత హోమం, రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. హోమ సమర్పణలు, రుద్ర మంత్ర పారాయణలతో సాగే ఈ పూజలో భాగస్వాములై ఇరు దేవతల కృపాకటాక్షాల కోసం ప్రార్థించండి. 

శని త్రయోదశి.. అరుదైన కలయిక 
ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి.. సాయంకాల ప్రదోష వేళతో కలిసినప్పుడు అది శివారాధనకు పవిత్రంగా మారుతుంది. ఆ సమయంలో చేసే శివారాధన ప్రాశస్త్యాన్ని స్కాందపురాణంలోని బ్రహ్మోత్తర ఖండం(6.5-8) వివరిస్తుంది. ఇంతటి పవిత్ర త్రయోదశి ప్రదోషం శనివారంతో కలిసివస్తే దానికి మరింత విశిష్టత చేకూరుతుంది. తిథి ఇచ్చే పవిత్రత.. ప్రదోష వేళ అందే శివారాధనా వైభవం.. శనివారం సంతరించుకునే శనైశ్చర ప్రాశస్త్యం.. ఈ మూడు ఏకకాలంలో సంగమించడం అత్యంత విశేషం. అందుకే సాధారణ ప్రదోషం కంటే శని ప్రదోషానికి ప్రత్యేక ఆదరణ ఉంది. 

శివుడి అనుగ్రహంతో శనిగ్రహ శాంతి 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనిదేవుడు కర్మఫల ప్రదాత. మన కర్మలకు ఫలితాలనిచ్చే దైవం ఆయనే! అందుకే ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని గోచారాలప్పుడు ఆయనను ప్రార్థిస్తారు. శనిదేవుడు సహనం, క్రమశిక్షణ, బాధ్యత, ధర్మబద్ధమైన జీవనానికి ప్రతీకగా భావించబడతాడు. అందుకే శని పాశుపత హోమంతో శని ప్రతికూలతలు తగ్గి, జీవిత ఆటంకాలను అధిగమించే శక్తి, స్థిరత్వం కలగాలని కోరుతారు. శని తండ్రి సూర్యుడు శివుడి అనుగ్రహానికి పాత్రుడని, శని సైతం శివారాధన చేశాడని కాశీఖండం పేర్కొంది. ఈ ఘట్టాలు శని శక్తికి శివానుగ్రహం ఆధారమనే భావనను తెలియజేస్తాయి. 

శనిదేవుడికి.. శివుడితో అనుబంధం 
బ్రహ్మాండ పురాణం- నవగ్రహ పీడాహర స్తోత్రంలోని శని స్తుతిలో ‘శివప్రియః’ అనే విశేషణం కనిపిస్తుంది. ఈ భావన శివశనుల సంగమ ఆరాధనా ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. శివపురాణంలోని శతరుద్ర సంహిత(25)లో పిప్పలాదుడు శివుని అంశగా వర్ణించబడతాడు. శని ప్రభావంతో ప్రజలు బాధలు చూసిన ఆయన 16 ఏళ్లలోపు పిల్లలకు శని పీడలు ఉండొద్దని వరం ఇస్తాడు. శివభక్తులపై కూడా శనిదేవుడి అనుగ్రహం ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే వీరిద్దరి ఆరాధనతో శని ప్రతికూల ప్రభావాలు తొలగి, ఆయురారోగ్యాలు కలగాలని ఈ పూజతో ప్రార్థించవచ్చు. 

8 కిలోల నువ్వులతో ‘శని పాశుపత హోమం’ 
జీవుడిని బంధించే అజ్ఞానం, అహంకారం, కర్మబంధాల నుంచి విముక్తి కలిగించే శివతత్త్వాన్ని పాశుపత ఆరాధన సూచిస్తుంది. లింగపురాణంలోని పాశుపత విధి వివరణలో ఈ హోమం ప్రాధాన్యం కనిపిస్తుంది. కర్మబంధాల నుంచి ఉపశమనం, మనోధైర్యం, ప్రతికూల పరిస్థితులను అధిగమించే శక్తి కోసం ఈ ఆరాధనలో ప్రార్థించవచ్చు. వైదిక, ధార్మిక క్రతువుల్లో ప్రత్యేక స్థానం గల నువ్వులను ‘హోమధాన్యం’, ‘పవిత్రం’, ‘పాపఘ్నం’ అని పిలుస్తారు. శని ఆరాధనలోనూ నల్ల నువ్వులకు ప్రాధాన్యముంది. అందుకే ఈ క్రతువులో 8 కిలోల నువ్వులను హోమద్రవ్యంగా వినియోగించడం విశేషం. ఈ హోమంలో ప్రతి ఆహుతి భక్తుల శని శాంతి సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. 

కార్తీక మాసం.. రుద్రాభిషేకం.. శివకటాక్షం 
శివారాధనకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసపు రుద్రాభిషేకానికి విశేష ప్రాధాన్యముంది. వేదాల్లోని శ్రీరుద్రం శివుడి రుద్రస్వరూపాన్ని స్తుతిస్తుంది. నమకచమక పారాయణంతో శివలింగానికి అభిషేక నిర్వహణ ఇందులో ప్రధాన విశేషం. కార్తీక మాస జలధారలతో రుద్రుడైన శివుడిని అభిషేకిస్తూ ఆయన కరుణ, శాంతి, రక్షణ కోసం ప్రార్థించవచ్చు. ఈ హోమంతో శని శాంతిని సైతం కోరవచ్చు. తద్వారా మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, కార్యసిద్ధి కలగాలని భక్తులు సంకల్పిస్తారు. 

‘పాశుపతి’ అనుగ్రహంతో బంధ విముక్తి 
మనలోని అజ్ఞానం, అహంకారం, కర్మబంధాలనే పాశాలను తొలగించే శివుడు ‘పశుపతి’గా ఆరాధించబడుతున్నాడు. దేవతలు సైతం ఈ బంధాల నుంచి విముక్తికై శివుడ్ని ఆశ్రయించినట్లు లింగ పురాణం పేర్కొంది. కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన శివుడు.. భక్తి, సాధనకు ప్రతీకగా నిలుస్తాడు. శివపురాణం-వాయవీయ సంహితలో బ్రహ్మాది దేవతలు సైతం పాశుపత వ్రతాన్ని ఆచరించిన విశేషం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వులతో నిర్వహించే పాశుపత శని హోమం ద్వారా శని సంబంధిత ప్రతికూల ప్రభావాలు శాంతించి, కర్మబంధాల నుంచి ఉపశమనం లభించాలని ప్రార్థించవచ్చు. జీవితంలోని ఆటంకాలు తొలగి ఆత్మబలం, మానసిక స్థైర్యం, శ్రేయస్సు కలగాలని సంకల్పించవచ్చు. 

కుటుంబ సౌఖ్యం కోసం.. 
శని గర్భంలో ఉన్నప్పుడు సూర్యుడి భార్య సంజ్ఞ తన ప్రతిరూప ఛాయను ఆయన వద్దే ఉంచి.. శివుడిని ఉద్దేశించి కఠోర తపస్సు చేయగా.. శనిదేవుడు నల్లని ఛాయతో జన్మించాడని పురాణ గాథలు చెబుతాయి. దీంతో సూర్యుడు సంజ్ఞను అనుమానించగా.. శివుడు వారిద్దరి నడుమ అపార్థాన్ని తొలగించినట్లు పేర్కొంటాయి. శని, శివుడి మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని స్మరిస్తూ.. కుటుంబంలో అపార్థాలు సమసి, సుఖశాంతులు నెలకొనాలని శివశనులను ప్రార్థించవచ్చు. కుటుంబసభ్యులందరూ కలిసి అరుదైన కలయికగా భావించే పర్వదినాన ఈ రెండు పూజల్లో పాల్గొని శని అనుకూలత, శివ కరుణ కోరవచ్చు. మనోబలం, ఆరోగ్యం, జీవితంలో స్థిరత్వం, కుటుంబ ఐక్యత, కార్యసిద్ధి కలగాలని ప్రార్థిస్తూ.. ఇప్పుడే మీ పూజను బుక్ చేసుకోండి.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

శని ప్రభావం నుంచి శాంతి

ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గోచారాల సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగాలని ప్రార్థన.

2

ఉద్యోగ, వృత్తి ఆటంకాల తొలగింపు

ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, పదోన్నతుల జాప్యం, వ్యాపారంలో నిలిచిపోయిన పనులు అనుకూలంగా మారాలని సంకల్పం.

3

అప్పుల నుంచి ఉపశమనం

ఆర్థిక ఒత్తిళ్లు, రుణభారాలు తగ్గి ఆదాయంలో స్థిరత్వం, సంపాదనలో వృద్ధి కలగాలని ఆరాధన.

4

కుటుంబ కలహాల నివారణ

భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్యత పెరగాలని ప్రార్థన.

5

అనుకోని అవరోధాల నుంచి రక్షణ

పదేపదే ఎదురయ్యే అడ్డంకులు, నష్టాలు, ప్రతికూల పరిస్థితులను అధిగమించే శక్తి, ధైర్యం కలగాలని సంకల్పం.

పూజ ప్రక్రియ

1

సంకల్పం

భక్తుల గోత్రనామాలు, పేర్లతో కుటుంబ క్షేమం, శని శాంతి, శివానుగ్రహం కోసం సంకల్పం చేస్తారు.

2

గణపతి పూజ

విఘ్నాలు తొలగి పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని గణపతిని ప్రార్థిస్తారు.

3

శని పాశుపత హోమం

శని సంబంధిత మంత్రోచ్చారణలతో 8 కిలోల నువ్వులను హోమద్రవ్యంగా సమర్పిస్తూ హోమం నిర్వహిస్తారు.

4

రుద్రాభిషేకం

శ్రీరుద్ర నమక, చమక మంత్ర పారాయణంతో శివలింగానికి అభిషేకం చేస్తారు.

5
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, ఆశీర్వచనం

హోమ పూర్ణాహుతి సమర్పించి శివశనుల అనుగ్రహం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

పూజలో మీకు లభించేవి

మీ నామగోత్రాలతో మహాసంకల్పం

8 కిలోల నువ్వుల సమర్పణ

వేదమంత్ర రుద్రాభిషేక ఫలితం

పూర్తి వీడియో 48 గంటల్లో మీ WhatsAppకి

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
8 కిలోల నువ్వులతో శని పాశుపత హోమం మరియు రుద్రాభిషేకం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support