కార్తీక మాసం ప్రత్యేకం

ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పించే విశ్వరూప విష్ణుమాయా మహా హోమం - మీ గోత్రనామాలతో!

  • రక్షణ & విఘ్న నివారణ
  • జాతకంలో గ్రహ దోష నివారణ
  • కుటుంబ సామరస్యం
రామ్‌జీ స్వాముల శ్రీమఠం - విష్ణుమాయా సంస్థానం, చెన్నై
29 నవంబర్, ఆదివారం | కార్తీక మాసం ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

ప్రతికూల శక్తుల ప్రభావాల నుంచి రక్షణ కల్పించి, భక్తులకు అజేయమైన ఆత్మబలాన్ని ప్రసాదించే మహాశక్తి స్వరూపుడిగా ‘శ్రీ విశ్వరూప విష్ణుమాయా స్వామి’ని ఆరాధిస్తారు. శివుని పరాక్రమం, విష్ణుమూర్తి యోగమాయా శక్తుల దివ్య సమ్మేళన స్వరూపంగా కొలువైన ఈ స్వామివారు ఆపదలో అభయమిచ్చే రక్షక దైవంగా ప్రసిద్ధి చెందాడు. అటువంటి మహాశక్తిమంతుడైన స్వామివారి అనుగ్రహం కోసం వైదిక, ఆగమ విధానాలతో విశ్వరూప ‘విష్ణుమాయా మహా హోమం’ జరగనుంది. ఈ కార్తీక మాసం నవంబర్ 29న చెన్నైలోని రామ్‌జీ స్వాముల శ్రీమఠం, విష్ణుమాయా సంస్థానంలో జరిగే ఈ పవిత్ర హోమంలో మీ పేరు, నక్షత్రంతో సంకల్పం చేయించుకుని స్వామివారి దివ్య రక్షణ, అనుగ్రహాన్ని పొందవచ్చు. 

శ్రీ విష్ణుమాయా స్వామి దివ్యశక్తి 
ఉగ్ర పరాక్రమం.. అపార కరుణ.. భక్తులకు అభయమిచ్చే రక్షణ.. ఈ మూడు విశిష్ట లక్షణాల సమ్మేళనమే శ్రీ విష్ణుమాయా స్వామి. ముఖ్యంగా కేరళతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈయనను శక్తిమంతమైన క్షేత్రపాలక, రక్షక దైవంగా ఆరాధిస్తారు. నిజమైన భక్తితో శరణు కోరినవారి మొర ఆలకించి, కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించే దైవంగా స్వామివారిని కొలుస్తారు. తెలియని భయాలు, ప్రతికూల శక్తుల ప్రభావాలు, దుష్టశక్తుల బాధల నుంచి రక్షణ కలగాలని భక్తులు స్వామివారిని శరణు వేడుతారు. ఆయన అనుగ్రహంతో భయాలు తొలగి, జీవితంలో ధైర్యం, సానుకూలత నిండాలని ప్రార్థిస్తారు. 

విశ్వవ్యాప్తమైన శక్తిస్వరూపం 
విశ్వరూపంలో అష్టదిక్కులు, పంచభూతాలు, నవగ్రహ శక్తులను తనలో ఇముడ్చుకున్న పరమశక్తిగా స్వామివారిని భావిస్తారు. ఈ రూపాన్ని ఆరాధించడం ద్వారా జీవితంలోని వివిధ సమస్యలను ఎదుర్కొనే ఆత్మబలం, ధైర్యం కలగాలని ప్రార్థిస్తారు. కంటికి కనిపించని భయాలు, అనవసరమైన ఆందోళనలు, మనసును కలవరపరిచే ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు. గృహంలో సానుకూల వాతావరణం నెలకొనాలని వేడుకుంటారు.

ధైర్యం, వివేకం ప్రసాదించే స్వామి 
దివ్యాయుధాలను ధరించి, బలానికి ప్రతీక అయిన దున్నపోతుపై విరాజిల్లే స్వామివారు అజేయ పరాక్రమానికి ప్రతిరూపం. తనను పెంచిన తల్లికి ఆపద కలిగించిన అడవి దున్నపోతునే లొంగదీసుకుని, తన వాహనంగా మలుచుకున్న వీరుడు ఆయన. ఎంతటి భయంకరమైన శక్తినైనా తన ఆధీనంలోకి తెచ్చుకోగల ఆయన పరాక్రమం అసమానం. స్వామివారి అనుగ్రహంతో భయాలు తొలగి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సంక్లిష్ట పరిస్థితుల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, కార్యసాధనకు అవసరమైన ఆత్మబలం కలగాలని భక్తులు కోరుకుంటారు. 

విశ్వరూప విష్ణుమాయా మహాహోమ విశిష్టత 
ఈ హోమంలో వైదిక మంత్రోచ్ఛారణతో పాటు ఆగమ విధానాలకు ప్రాధాన్యం ఉంటుంది. స్వామివారి మూలమంత్రాలు, పురుషసూక్తం, శ్రీరుద్రం, రక్షణను కోరే విశేష మంత్రాలతో యాగం నిర్వహిస్తారు. కవచ మంత్రాలను పఠిస్తూ స్వామివారి దివ్యశక్తిని ఆవాహన చేసి ప్రార్థిస్తారు. విశేష మూలికలు, పుష్పాలు, నవధాన్యాలు, తేనె, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వంటి పవిత్ర ద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తారు. ప్రతి ఆహుతితో భక్తుల సంకల్పాలు, ప్రార్థనలను స్వామివారికి నివేదిస్తారు. 

శ్రీ విష్ణుమాయా స్వామి అవతార విశేషం 
శ్రీ విష్ణుమాయా స్వామివారి ఆవిర్భావం శైవ, వైష్ణవ శక్తుల సమ్మేళనంగా కొన్ని ప్రాంతీయ పురాణ, క్షేత్ర సంప్రదాయాల్లో వివరించబడింది. ఆ కథనాల ప్రకారం.. లోకాలను పీడిస్తున్న అసుర శక్తులను అణచి, ధర్మాన్ని కాపాడేందుకు పరమశివుడు ఉగ్ర కిరాతమూర్తి రూపాన్ని ధరించగా, పార్వతీదేవి మహావిష్ణువు యోగమాయా శక్తిని ధరించి దివ్యరూపంలో అవతరించింది. ఈ దివ్యశక్తుల కలయిక నుంచి అపార పరాక్రమం కలిగిన శ్రీ విష్ణుమాయా స్వామి ఆవిర్భవించినట్లు కథనాలు చెబుతాయి. అందుకే శివుని జ్ఞానశక్తి, పార్వతీదేవి పరాశక్తి, మహావిష్ణువు యోగమాయా ప్రభావాల సమ్మేళనంగా స్వామివారిని వర్ణిస్తారు. అనంతరం విశ్వరూపాన్ని ధరించి దుష్టశక్తులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించిన దైవంగా ఆయనను కీర్తిస్తారు. అందుకే నేటికీ భక్తులు తమ జీవితాల్లోని ఆపదలు, ఆటంకాలు తొలగి, శక్తి, ధైర్యం, రక్షణ కలగాలని విష్ణుమాయా స్వామిని భక్తితో ప్రార్థిస్తారు.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

ప్రతికూల శక్తుల నుంచి రక్షణ

ప్రతికూల శక్తుల ప్రభావాలు, తెలియని భయాలు, ఆందోళనల నుంచి విముక్తి కలగాలని ప్రార్థించవచ్చు.

2

ఆటంకాల నుంచి విముక్తి

వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి, అభివృద్ధికి కొత్త అవకాశాలు కలగాలని స్వామివారి అనుగ్రహాన్ని కోరవచ్చు.

3

మానసిక ప్రశాంతత

అనవసరమైన భయాలు, ఆందోళనలు, మనసులోని గందరగోళం తగ్గి ప్రశాంతమైన ఆలోచనా విధానం అలవడాలని ప్రార్థించవచ్చు.

4

దైవిక రక్షణ

కుటుంబం, నివాసం, వ్యాపార ప్రదేశాల్లో సానుకూల వాతావరణం నెలకొని, ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కలగాలని కోరవచ్చు.

5

గ్రహదోష శాంతి

జాతకంలో గ్రహ సంబంధిత ప్రతికూలతలు తగ్గి, క్లిష్టమైన దశలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలగాలని ప్రార్థించవచ్చు.

6

దుష్టశక్తుల నుంచి అభయం

దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, కుటుంబానికి, నివాసానికి దైవిక రక్షణ కలగాలని కోరుకోవచ్చు.

పూజ ప్రక్రియ

1

అనుజ్ఞ, మహాగణపతి పూజ

హోమం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తికావాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించి, ఆయన అనుమతితో పూజను ప్రారంభిస్తారు.

2

పుణ్యాహవాచనం, కలశ స్థాపన

పవిత్ర జలాలతో యాగశాలను, పూజా ద్రవ్యాలను శుద్ధి చేసి, కలశంలో స్వామివారిని ఆవాహన చేస్తారు.

3

మహా సంకల్పం

భక్తుల పేరు, నక్షత్రం, గోత్ర వివరాలతో కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కోసం సంకల్పం చేస్తారు.

4

మూలమంత్ర, కవచ జపం

విష్ణుమాయా స్వామివారి మూలమంత్రాలు, పురుషసూక్తం, రక్షణ మంత్రాలను పఠిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని ఆహ్వానిస్తారు.

5

విశ్వరూప విష్ణుమాయా మహా హోమం

వైదిక మంత్రాల నడుమ మూలికలు, పుష్పాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి వంటి పవిత్ర ద్రవ్యాలతో అగ్నికి ఆహుతులు సమర్పిస్తారు.

6
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, మహా దీపారాధన

విశేష ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించి, స్వామివారికి మహా దీపారాధన నిర్వహించి హోమాన్ని సంపూర్ణం చేస్తారు.

పూజలో మీకు లభించేవి

కుటుంబసభ్యుల పేర్లతో ప్రత్యేక సంకల్పం

వైదిక, ఆగమ విధానాలతో జరిగే హోమంలో భాగస్వామ్యం.

పూజ తర్వాత హోమం వీడియో మీ వాట్సాప్‌కు

దేవాలయం వివరాలు

రామ్‌జీ స్వాముల శ్రీమఠం - విష్ణుమాయా సంస్థానం

చెన్నై

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పించే విశ్వరూప విష్ణుమాయా మహా హోమం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support