శని సంక్రమణం ప్రత్యేకం

శని తైలాభిషేకం మరియు శనిగ్రహ శాంతి హోమం - మీ గోత్రనామాలతో!

  • కాలసర్ప దోషం
  • శని దోషం
  • రక్షణ & విఘ్న నివారణ
వైదిక యాగశాల, హైదరాబాద్, తెలంగాణ
11 డిసెంబర్, శుక్రవారం | శని సంక్రమణం ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

మన జీవితంలో చేసే ప్రతి కర్మకు తగిన ఫలితాలను ప్రసాదించే నవగ్రహాల్లో ‘శని’ది విశిష్ట స్థానం. అటువంటి శని గమనంలో ‘డిసెంబర్ 11’ ఓ మహత్తర ఘట్టం. ఆయన వక్రగమనాన్ని వీడి మార్గగతిలోకి రానున్నారు. ఈ గ్రహగమన పరిణామం ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావిత రాశులవారికి ప్రాధాన్యం కలిగినదిగా జ్యోతిష్యంలో భావిస్తారు. ఈ వేళ ఆయనను భక్తితో కొలిచి, గ్రహపీడల ఉపశమనం, కార్యవిజయం, ఆయురారోగ్యాలు, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థిస్తారు. ఈ పవిత్ర సంకల్పంతోనే శని తైలాభిషేకం, శనిగ్రహ శాంతి హోమాలను వేదమందిర్ నిర్వహిస్తోంది. ఈ పూజల్లో గోత్రనామాలతో సంకల్పం చేయించుకుని శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రార్థించవచ్చు.

మార్గగమనంతో మారనున్న గ్రహబలం! 
శని తన సాధారణ గమనానికి భిన్నంగా వక్రస్థితిలో సంచరించడమే ‘శని మార్గి’. జ్యోతిష్యంలో ఈ దశను కర్మఫలాలు, గత కార్యాల ప్రభావాలు, జీవిత పురోగతికి కీలక సమయంగా భావిస్తారు. డిసెంబర్ 11న శని ఈ మార్గగతిలోకి రానున్నాడు. ఈ మార్పుతో శని ప్రభావిత రాశులవారు ఆయనను శ్రద్ధతో ఆరాధిస్తే.. గ్రహపీడల నుంచి ఉపశమనం, ఆటంకాల నివారణ, పనుల్లో పురోగతి, వృత్తి జీవితంలో స్థిరత్వం కలుగుతాయని నమ్ముతారు. ఇందుకోసం శని తైలాభిషేకం, శనిగ్రహ శాంతి హోమాల ద్వారా శని కృపకై వేడుకుంటారు. గ్రహస్థితిగతుల శుభాశుభ ఫలితాలను బృహత్ పరాశర హోరాశాస్త్రం వివరిస్తుంది. 

ఈ రాశులవారిపై ప్రభావం.. 
శనిదేవుడు వక్రగతిని వీడి మార్గస్థితిలోకి వస్తున్న సందర్భంగా.. ఈ గ్రహగమన మార్పు ముఖ్యంగా ఐదు రాశులవారిపై ప్రభావం చూపనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
  • మేష రాశి : ఏలినాటి శని ప్రారంభ దశ - ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరిగే అవకాశం. 
  • మీన రాశి : ఏలినాటి శని మధ్య దశ (జన్మశని) - మానసిక ఒత్తిళ్లు, పనుల్లో ఆలస్యం, బాధ్యతలు పెరగవచ్చు. 
  • కుంభ రాశి : ఏలినాటి శని చివరి దశ - ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి క్రమంగా ఉపశమనం లభించే అవకాశం. 
  • సింహ రాశి : అష్టమ శని - వృత్తి, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. 
  • ధనుస్సు రాశి : అర్ధాష్టమ శని - ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిళ్లు, పనుల్లో జాప్యం ఎదురుకావచ్చు.
  • శని ప్రభావాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారే కాకుండా, శనిదేవుడి అనుగ్రహాన్ని కోరుకునే వారు, జీవితంలో మరింత శుభం, అభివృద్ధి కలగాలని ఆశించేవారు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు. 


తైల సమర్పణతో శనిదేవుడి అనుగ్రహం! 
శనిని భక్తితో ఆరాధిస్తే వరాలను సైతం ప్రసాదిస్తాడనేందుకు దశరథ ఘట్టమే నిదర్శనం. పద్మపురాణం(ఉ.ఖం.33) ప్రకారం.. తమ రాజ్యంలో కరవు ఏర్పడకుండా ఉండేందుకు దశరథుడు, శనిని ప్రార్థిస్తాడు. దశరథ భక్తికి మెచ్చిన శని, తనను శమీపత్రాలు, నువ్వులు, ఇనుము ద్రవ్యాలతో ఆరాధిస్తే.. గ్రహపీడల నుంచి రక్షణ కల్పిస్తానని అభయమిస్తాడు. ఈ ఘట్టం శని ఆరాధనలో నువ్వులు, నూనె ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ సమర్పణలో వీటికి విశేష స్థానం ఉంది. శని ఆరాధనతో ఆయురారోగ్యాలు, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యంకై ప్రార్థిస్తారు. 

శనిగ్రహ శాంతి హోమం.. 
 శని ప్రతికూల ప్రభావాల ఉపశమనానికై చేసే శనిగ్రహ శాంతి హోమంలో శనిదేవుడిని అగ్నిలో ఆవాహన చేసి, మంత్ర పఠనాలతో నల్ల నువ్వులు, నెయ్యి, శమీ సమిధలతో ఆహుతులు సమర్పిస్తారు. బృహత్ పరాశర హోరాశాస్త్రం, శని కల్పంలో శని గ్రహపీడల నివారణకు హోమం, నువ్వులతో చేసే శాంతి కర్మల ప్రస్తావన ఉంది. అగ్నిముఖంగా చేసే హోమ ఆహుతులు నేరుగా గ్రహ దేవతలను ప్రసన్నం చేసుకుంటాయని ప్రతీతి. ఈ హోమంతో శని ప్రభావాల ఉపశమనం, అప్పుల బాధలు, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతికై ప్రార్థిస్తారు. 

శని ఆరాధనలో తిలం, తైలం ఎందుకు ప్రత్యేకం? 
రావణుడి చెర నుంచి విడిపించే సమయంలో గాయాలతో బాధపడుతున్న శనిదేవుడికి ఆంజనేయుడు నువ్వుల నూనెతో మర్దన చేసి ఉపశమనం కలిగిస్తాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకు సంతోషించిన శని, తనకు తైలాభిషేకం చేసే భక్తులకు గ్రహపీడల నుంచి రక్షణ కల్పిస్తానని వరమిచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఇలా శని ఆరాధనలో నువ్వుల నూనె, నల్ల నువ్వులకు ప్రాధాన్యం ఏర్పడినట్లు నమ్ముతారు. శని శ్యామవర్ణ స్వరూపానికి ప్రతీకగా ఆ రంగు ద్రవ్యాలను ఆయన ఆరాధనలో ఉపయోగిస్తారు. ఆటంకాల నివారణ, ఆయురారోగ్యాలకై ప్రార్థిస్తారు. 

శని అనుగ్రహ ప్రాప్తికి ఇప్పుడే సంకల్పించండి! 
ధర్మం, న్యాయం, కర్మఫలాలకు అధిదేవత అయిన శనిదేవుడి అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం, సాటి జీవుల పట్ల న్యాయం, బాధ్యతల నిర్వహణ వంటి ధర్మకార్యాలను ఆచరించాలని జ్యోతిష్యులు సూచిస్తారు. అంతటి దయామయ కర్మప్రదాత అనుగ్రహాన్ని అర్థించేందుకు.. ఆయన వక్రగమనాన్ని వీడి మార్గగతిలోకి వచ్చే డిసెంబర్ 11 పవిత్ర సందర్భం. ఈ పుణ్యసమయంలో జరిగే శని తైలాభిషేకం, శనిగ్రహ శాంతి హోమాల్లో మీ గోత్రనామాలతో సంకల్పం చేయించుకోండి. శని ప్రభావంతో ఏర్పడే సమస్యలన్నీ తొలగి, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, ధనస్థిరత్వం, ఆయురారోగ్యాలు, కుటుంబ సౌఖ్యం కలగాలని శనీశ్వరుడిని వేడుకోండి. 

శనిదేవుడి మార్గగమనంతో మీ జీవితంలోనూ శుభమార్పులకు శ్రీకారం చుట్టండి.. ఆయన దివ్యానుగ్రహాన్ని సొంతం చేసుకోండి!
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

గ్రహపీడల ఉపశమనం

ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి ఉపశమనం కలగాలని ప్రార్థించవచ్చు.

2

కార్యవిజయం

వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగి పనులు సజావుగా సాగాలని కోరుకోవచ్చు.

3

ఆర్థిక స్థిరత్వం

అప్పుల బాధలు తగ్గి ఆదాయం, సంపద స్థిరంగా ఉండాలని సంకల్పించవచ్చు.

4

ఆయురారోగ్యాలు

అనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని వేడుకోవచ్చు.

5

కుటుంబ సౌఖ్యం

కుటుంబంలో కలహాలు తొలగి ప్రశాంతత, సంతోషం నెలకొనాలని ప్రార్థించవచ్చు.

పూజ ప్రక్రియ

1

గోత్రనామ సంకల్పం

భక్తుల గోత్రనామాలతో పూజా సంకల్పం చేసి శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

2

శని తైలాభిషేకం

శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్ల నువ్వులు, పుష్పాలతో అర్చన నిర్వహిస్తారు.

3

శని మంత్ర పఠనం

శని బీజ మంత్రాలు, స్తోత్రాలను పఠిస్తూ స్వామివారిని భక్తితో ఆరాధిస్తారు.

4

శనిగ్రహ శాంతి హోమం

హోమకుండంలో శనిదేవుడిని ఆవాహన చేసి, నల్ల నువ్వులు, నెయ్యి, శమీ సమిధలతో మంత్రపూర్వకంగా ఆహుతులు సమర్పిస్తారు.

5
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, ఆశీర్వచనం

పూర్ణాహుతితో హోమాన్ని ముగించి, వేదపండితుల ఆశీర్వచనంతో శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

పూజలో మీకు లభించేవి

గోత్రనామాలతో పూజా సంకల్పం

పూర్ణాహుతి, స్వామివారి ఆశీస్సులు

పూజ పూర్తి వీడియో మీ వాట్సాప్‌కు

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
శని తైలాభిషేకం మరియు శనిగ్రహ శాంతి హోమం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support