సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం - మీ గోత్రనామాలతో!

  • కాలసర్ప దోషం
  • జాతకంలో గ్రహ దోష నివారణ
  • కుటుంబ సామరస్యం
వైదిక యాగశాల, హైదరాబాద్, తెలంగాణ
15 డిసెంబర్, మంగళవారం | సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

6 ముఖాలు, 12 భుజాలతో దివ్యాయుధధారిగా, దేవతల సేనాధిపతిగా విరాజిల్లే సుబ్రహ్మణ్య స్వామిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ రోజున ఆరాధించడం పుణ్యప్రదంగా భావిస్తారు. అలాంటిది ఈసారి ఈ పర్వదినం మంగళవారంతో కలిసి రావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారి జయంతికి మంగళవారం తోడవడంతో ఈ ఆరాధనతో రెట్టింపు ఫలితం లభిస్తుందని ప్రతీతి. అందుకే ఈ దైవిక విశేషతను భక్తులకు అందించాలనే సంకల్పంతో వేదమందిర్ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దివ్యకళ్యాణం, శివ సుబ్రహ్మణ్య శత్రు సంహార త్రిశతీ హోమం నిర్వహిస్తోంది. ఇందులో మీరూ పాల్గొని వివాహ ప్రాప్తి, దాంపత్య సౌఖ్యం, సంతాన భాగ్యం, కుజ, సర్ప దోష శాంతి, శత్రుబాధల నివారణ, కార్యవిజయం కోసం ప్రార్థించవచ్చు. 

6 ముఖాల వెనుక దివ్యతత్త్వం 
శివుడి తేజస్సు నుంచి ఆవిర్భవించిన కుమారస్వామి, కృత్తికా దేవతల సంరక్షణలో పెరిగి ‘కార్తికేయుడి’గా ప్రసిద్ధి చెందాడు. 6 కృత్తికలు 6 ముఖాలతో స్వామివారికి పాలుపట్టినట్లు పురాణ కథనం. అందుకే ఆయనకు ‘షణ్ముఖుడు’ అనే పేరొచ్చింది. దేవతల సేనకు అధిపతిగా తారకాసురుడు, సూరపద్ముడు వంటి రాక్షసులను సంహరించి ధర్మాన్ని కాపాడిన వీరుడిగా, జ్ఞానం, ధైర్యం, పరాక్రమం, విజయానికి ప్రతీకగా స్వామివారిని ఆరాధిస్తారు. అందుకే భయాలు, ఆటంకాలు తొలగి, సంకల్పాలు నెరవేరాలని, మనోబలం పెరగాలని ఆయనను వేడుకుంటారు. 

సుబ్రహ్మణ్య షష్ఠి మహిమ 
మార్గశిర శుక్ల షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా భక్తితో జరుపుకుంటారు. ఈ తిథి స్వామివారి ఆవిర్భావంతో ముడిపడినదిగా కొన్ని ఆరాధనా సంప్రదాయాలు పేర్కొంటాయి. షష్ఠి తిథి కార్తికేయుడికి ప్రీతికరమైనదిగా భావించి ఉపవాసం, అభిషేకం, అర్చన, హోమాలు నిర్వహిస్తారు. అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని స్మరించుకునే రోజుగా కూడా ఈ ఆరాధనకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అందుకే ఈ రోజున స్వామిని సేవించి ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, కార్యసిద్ధి, సంతాన సౌభాగ్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు.

కుజ దోష నివారణకు ‘స్వామివారి అనుగ్రహం’ 
మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజగ్రహ శాంతికి అధిష్ఠాన దైవంగా కార్తికేయుడిని ఆరాధిస్తారు. అందుకే స్వామివారిని మంగళవారం నాడు ఆరాధిస్తే కుజ దోష ప్రభావాలు శాంతిస్తాయని నమ్ముతారు. వివాహానికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగాలని ప్రార్థిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి కథనాల్లోనూ వీటి గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. ఈ నమ్మకంతోనే వివాహ ఆలస్యం, దాంపత్య సమస్యలు, జాతకంలోని కుజ గ్రహ ప్రతికూలతల నివారణ కోరుతూ స్వామివారినిని ఆశ్రయిస్తారు. 

సుబ్రహ్మణ్య షష్ఠి- మంగళవారం కలయిక ప్రత్యేకత 
కార్తికేయుడికి ప్రీతికరమైన షష్ఠి తిథి, కుజగ్రహానికి సంబంధించిన మంగళవారం ఒకే రోజున రావడం ఈ ఆరాధనకు మరింత విశిష్టతను ఇస్తుంది. ఓవైపు స్వామి జన్మతిథిగా భావించే షష్ఠి; మరోవైపు కుజ శాంతి కోసం స్వామిని ప్రార్థించే మంగళవారం.. ఈ 2 సందర్భాలను కలిపుతూ వల్లీ దేవసేన సమేత కళ్యాణం, శత్రు సంహార శివ సుబ్రహ్మణ్య త్రిశతీ హోమం నిర్వహించడం ఇంకా విశేషం. ఈ పూజల్లో పాల్గొనడం వల్ల.. వివాహ ప్రాప్తి, దాంపత్య అన్యోన్యత, సంతాన భాగ్యం, దోష శాంతి, శత్రుబాధల నుంచి రక్షణ కోసం స్వామివారిని ప్రార్థించవచ్చు. 

300 నామాలతో శివ సుబ్రహ్మణ్య త్రిశతీ హోమం 
శివ సుబ్రహ్మణ్య త్రిశతీ అనేది సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేసిన మంత్ర స్తోత్రం. ఇందులో స్వామివారి 300 దివ్య నామాలు ఉంటాయి. ఈ స్తోత్రాన్ని ‘శత్రు సంహార శివ సుబ్రహ్మణ్య త్రిశతీ’ అని కూడా పిలుస్తారు. ఇందులోని నామాలు ‘న, మ, శ, వ, య’ అనే అక్షరాలతో పాటు మాతృకా బీజాక్షరాల సమ్మేళనంతో అమర్చబడి ఉంటాయి. ప్రతి నామం స్వామి మూలమంత్రంతో అనుసంధానమై ఉంటుంది. అలాగే ఈ 300 నామాలను 6 భాగాలుగా చేసి, శివుని పంచబ్రహ్మ స్వరూపాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, అధోముఖ స్వరూపాలను కూడా స్మరిస్తారు. 

హోమంలోని మంత్రశక్తి – శత్రు సంహారతత్త్వం 
ఈ త్రిశతిలో స్వామిని శూరపద్మ సంహారకుడిగా, శత్రుభయాన్ని తొలగించేవాడిగా, భక్తులకు అభయమిచ్చేవాడిగా స్తుతిస్తారు. అందులోని మంత్రభాగంలో శత్రు వినాశనం, భయ నివారణను కోరే ప్రార్థనలుంటాయి. ఈ మంత్రాలతో నిర్వహించే హోమాన్ని బాహ్య శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు తొలగాలనే కాకుండా, మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతర్గత శత్రువులను జయించే ఆధ్యాత్మిక సాధనగా కూడా భావిస్తారు. వేద పండితుల మంత్రపఠనం, అగ్నికి ఆహుతుల సమర్పణ, పూర్ణాహుతితో ఈ హోమం సంపూర్ణమవుతుంది. 

సంతాన సౌఖ్యం కోసం.. 
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం స్వామివారి దివ్యకళ్యాణంలో 2 విశిష్ట ఘట్టాలున్నాయి. దేవతలను రక్షించిన స్వామివారికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం జరిపించినట్లు ప్రతీతి. మరోవైపు, నంబిరాజు పెంచిన వల్లీదేవి స్వామివారిని భర్తగా పొందాలని తపించగా, గణపతి ఏనుగు రూపంలో చేసిన లీల అనంతరం స్వామివారు ఆమెను పరిణయమాడినట్లు మరో కథనం. ఈ కళ్యాణంలో కన్యాదానం, మాంగల్యధారణ, మాలల మార్పిడి, మంగళహారతి వంటి ఘట్టాలు నిర్వహిస్తారు. ఈ దివ్యకళ్యాణం ద్వారా వివాహ ప్రాప్తి, దాంపత్య అన్యోన్యత కోసం భక్తులు ప్రార్థిస్తారు. 

సర్పదోష నివారణకు పవిత్ర ఆరాధన 
నాగారాధనలో సుబ్రహ్మణ్య స్వామికి విశిష్ట స్థానం ఉంది. స్కంద పురాణంలోని కథనాల ప్రకారం.. నాగరాజులు వాసుకి, తక్షకులు స్వామివారిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో శాపబాధల నుంచి విముక్తి పొందినట్లు వృత్తాంతాలు ఉన్నాయి. నాగులకు స్వామివారు అభయమిచ్చిన దైవంగా భావించడం వల్లే ఆయనను నాగదేవతా స్వరూపంగానూ కొలుస్తారు. ముఖ్యంగా షష్ఠి తిథి స్వామివారి ఆరాధనకు, నాగారాధనకు విశేషమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర దినాన స్వామివారిని ఆరాధిస్తే.. నాగదోషం, కాలసర్ప దోష ప్రభావాలు తొలగి, కుటుంబానికి శుభం కలగాలని ప్రార్థించవచ్చు.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

కుజ దోష నివారణ

జాతకంలోని కుజదోష ప్రభావాలు తగ్గి, వివాహ సంబంధిత ఆటంకాలు తొలగాలని ప్రార్థించవచ్చు.

2

సర్పదోష శాంతి

నాగదోషం, కాలసర్ప దోష ప్రభావాల నుంచి ఉపశమనం కలగాలని స్వామివారిని వేడుకోవచ్చు.

3

శత్రు సంహారం

శత్రుబాధలు, వివాదాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కలగాలని ప్రార్థించవచ్చు.

4

దాంపత్య సౌఖ్యం

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత పెరిగి సుఖమయ జీవితం కలగాలని కోరవచ్చు.

5

సంతాన భాగ్యం

సంతాన ప్రాప్తి, సంతానం ఆరోగ్యం, అభివృద్ధి కోసం స్వామివారి అనుగ్రహాన్ని కోరవచ్చు.

పూజ ప్రక్రియ

1

విఘ్నేశ్వర పూజ

పూజ నిర్విఘ్నంగా పూర్తికావాలని మహాగణపతిని ఆరాధించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

2

పుణ్యాహవాచనం, కలశ స్థాపన

పవిత్ర జలాలతో యాగశుద్ధి చేసి, కలశంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహన చేస్తారు.

3

మహా సంకల్పం

భక్తుల గోత్రనామాలతో వివాహం, సంతానం, కుటుంబ క్షేమం, దోష శాంతి వంటి సంకల్పాలు చెబుతారు.

4

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం

వేదమంత్రాల నడుమ కన్యాదానం, మాంగల్యధారణ, మాలల మార్పిడి, మంగళహారతి వంటి ఘట్టాలతో దివ్యకళ్యాణం నిర్వహిస్తారు.

5

శివ సుబ్రహ్మణ్య త్రిశతీ హోమం

స్వామివారి 300 నామాలతో, శత్రు సంహార మంత్రాలను పఠిస్తూ పవిత్ర ద్రవ్యాలతో అగ్నికి ఆహుతులు సమర్పిస్తారు.

6
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, మహా మంగళహారతి

విశేష ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించి, స్వామివారికి హారతి ఇచ్చి పూజను సంపూర్ణం చేస్తారు.

పూజలో మీకు లభించేవి

కుటుంబసభ్యుల పేర్లతో గోత్రనామ సంకల్పం

వల్లీ దేవసేన సమేత స్వామివారి కళ్యాణ భాగస్వామ్యం

300 నామాలతో త్రిశతీ హోమ భాగస్వామ్యం

స్వామివారి దివ్య అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థన

24 గంటల్లో వాట్సాప్‌కు పూజా వీడియో

దేవాలయం వివరాలు

వైదిక యాగశాల, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం - మీ గోత్రనామాలతో!
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support