జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, వివాహం.. వీటి కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వీటిని ప్రసాదించే దేవగురువు ‘బృహస్పతి’ అనుగ్రహం లభిస్తేనే జీవితంలోని శుభాలకు మార్గం సుగమమవుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతారు. అటువంటి గురుదేవుని అనుగ్రహానికై ప్రార్థించేందుకు ఓ విశేష ఘడియ రాబోతోంది. ఈ డిసెంబర్ 13న బృహస్పతి వక్రగతిలోకి ప్రవేశించనున్నారు. ఈ సమయంలో గురుదేవుని ఆరాధించడం విశేష ఫలప్రదమని విశ్వాసం. అందుకే ఈ అరుదైన దినాన వేదమందిర్ తిరుపతి నవగ్రహ దేవాలయంలో గురుగ్రహ శాంతి హోమాన్ని నిర్వహిస్తోంది. ఈ మహత్తర వైదిక క్రతువులో మీ పేరు, గోత్రంతో సంకల్పం సమర్పించి, దేవగురువు కృపాకటాక్షాలను ప్రార్థించవచ్చు.
గురు శాంతి హోమంతో ‘ఆగిపోయిన పనులకు కొత్త దారి’
జ్యోతిష్యపరంగా గురు వక్రగతి సమయాన్ని ఆత్మపరిశీలనకు, గత కార్యాల సమీక్షకు, అసంపూర్తి పనులను చక్కదిద్దుకోవడానికి అనువైన కాలంగా భావిస్తారు. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు గ్రహానికి చేష్టాబలం పెరుగుతుందని జ్యోతిష్య సూత్రాలు వివరిస్తాయి. అందుకే ఈ సమయంలో గురుగ్రహ శాంతి జపహోమాలు చేయడం విశేష ఫలప్రదమని విశ్వసిస్తారు. ముఖ్యంగా వక్రగతి ప్రారంభమయ్యే రోజున చేసే గ్రహశాంతి పరిహారాలకు ప్రత్యేక ప్రాధాన్యముంది. గురు దోష ప్రభావాలు తగ్గి, శుభ ఫలితాలు కలగాలని కోరే ఎవరైనా ఈ హోమంలో పాల్గొనవచ్చు.
ఈ గురు వక్రగతి ఎందుకు ప్రత్యేకం?
గ్రహాల గమనంలో వచ్చే మార్పుల్లో ‘గురు వక్రగతి’ ఇంకా ప్రత్యేకం. 2026 డిసెంబర్ 13న గురువు సింహరాశిలోకి వక్రగతిలో ప్రవేశించి, 2027 జనవరి 25న కర్కాటకంలోకి వెళ్తాడు. కర్కాటకం గురువుకు ఉచ్ఛస్థానం. వక్రగమనంలో తిరిగి తన ఉచ్ఛరాశిలోకి రావడం ఈ గోచారానికి మరింత ప్రత్యేకత తీసుకొస్తుంది. ఆ సమయంలో గతంలో మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు సాగడం, పెండింగ్‌లో ఉన్న ప్రయత్నాలకు అనుకూలత కలగడం వంటి కొత్త అవకాశాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 6 రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
మీది ఈ 6 రాశుల్లో ఒకటా?
- మేషరాశి - చతుర్థ గురు: గృహం, వాహనం, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. కుటుంబ వ్యవహారాల్లోనూ జాగ్రత్త అవసరం.
- వృషభరాశి - తృతీయ గురు: సోదరులు, బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రయాణాలు, కొత్త ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు.
- కర్కాటకరాశి - జన్మ గురు: ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విషయంలో శ్రద్ధ అవసరం. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు.
- సింహరాశి - ద్వాదశ గురు: అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.
- ధనుస్సురాశి - అష్టమ గురు: ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక బాధ్యతలు పెరగవచ్చు. ఆరోగ్యం, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
- కుంభరాశి - షష్టమ గురు: అప్పులు, ఉద్యోగ బాధ్యతలు, వివాదాల విషయంలో ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ రాశుల వారు గురుగ్రహ శాంతి హోమంలో పాల్గొని, తమ పేరు గోత్రాలతో సంకల్పం సమర్పించి గురుదేవుని అనుగ్రహం కోసం ప్రార్థించవచ్చు. ఇతర రాశుల వారు కూడా గురుదేవుని అనుగ్రహం, శుభఫలాల ప్రాప్తికై ఈ గురుగ్రహ శాంతి హోమంలో భాగస్వాములవ్వొచ్చు.
గురు ఆరాధనతో శివానుగ్రహం కూడా!
పరమశివుని అనుగ్రహంతోనే బృహస్పతి దేవతలకు గురువుగా మహోన్నత స్థానాన్ని పొందాడని స్కంద పురాణంలోని కాశీఖండం చెబుతోంది. అంగీరస మహర్షి కుమారుడైన బృహస్పతి కాశీలో శివుడి కోసం తపస్సు ఆచరించి దేవగురువు పదవిని వరంగా పొందాడు. అందుకే గురుదేవుని ఆరాధనలో శివుడి కటాక్షం కూడా అంతర్లీనంగా ఉంటుందని ప్రతీతి. బృహస్పతిని భక్తితో ప్రార్థించడం ద్వారా గురు అనుగ్రహంతో పాటు పరమశివుని ఆశీస్సులు కూడా తోడవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మవైవర్త, మత్స్య పురాణాల్లోనూ వీటి ప్రస్తావన ఉంది.
సంపద ఉన్నా.. గురుకటాక్షమే అసలైన ‘ఐశ్వర్యం’
గురువు అనుగ్రహం పొందడమే కాదు.. దాన్ని నిలబెట్టుకునే వినయమూ అవసరమే. దీనికి ఇంద్రుడి గాథే నిదర్శనం. ఐశ్వర్య గర్వం, అహంకారంతో ఇంద్రుడు ఓసారి తన సభకు వచ్చిన బృహస్పతిని గౌరవించకపోవడంతో బృహస్పతి అదృశ్యమయ్యాడు. దీంతో దేవతలు గురువు మార్గదర్శకత్వం కోల్పోయి, అసురుల చేతిలో ఓడిపోయారు. అప్పుడే ఇంద్రుడికి గురువు విలువ తెలిసింది. ఈ గాథ చెప్పే నీతి ఏంటంటే.. సంపద, అధికారం ఉన్నా గురు కటాక్షం, వినయం లేకపోతే వాటిని నిలబెట్టుకోలేం. అందుకే గురుదేవుని అనుగ్రహానికై ఇప్పుడే ప్రార్థించండి.
గురు అనుగ్రహంతోనే రాముడు, పాండవుల విజయం
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరైన మార్గదర్శకత్వం ఉంటే ముందుకు సాగి, విజయం సొంతం చేసుకోవచ్చు. అందుకు మన ఇతిహాసాలే నిదర్శనం. రామాయణంలో భరద్వాజుడి (గురువు పుత్రుడు) ఆశీస్సులు రాముడి వనవాసంలో కీలకమయ్యాయి. వనవాసంలో సరైన ఆశ్రయాన్ని సూచించి, రాముడి ధర్మనిష్ఠ కొనసాగడానికి ఆయన అనువైన మార్గాన్ని చూపారు. భారతంలో ద్రోణాచార్యుడి(భరద్వాజుని పుత్రుడు) శిక్షణ పాండవుల విజయానికి పునాది వేసింది. అర్జునుడిలోని విలువిద్యా నైపుణ్యాన్ని వెలికితీసి, అతడిని అసమాన ధనుర్ధారిగా తీర్చిదిద్దింది. ప్రతిభకు సరైన దిశ, ప్రయత్నానికి బలం, విజయానికి మార్గం చూపించేది గురు కటాక్షమే. అంతటి దేవగురువు కటాక్షం మన జీవితంలోనూ వెలుగులు నింపాలని కోరుకునే భక్తులకు ఈ గురు వక్రగతి ఒక విశిష్ట సమయం. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న గురుగ్రహ శాంతి హోమంలో పాల్గొనేందుకు మీ పూజను ఇప్పుడే బుక్ చేసుకుని గురుదేవుని కృప కోసం సంకల్పం సమర్పించండి.