దత్తాత్రేయ జయంతి ప్రత్యేకం

దత్తాత్రేయ హోమం మరియు శ్రీ గురుదత్త పాదుకా పూజ

  • కుటుంబ శాంతి
  • విద్యాభ్యాసంలో అడ్డంకులు
  • జ్ఞానవృద్ధి
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, తిరుపతి
23 డిసెంబర్, బుధవారం | దత్తత్రేయ జయంతి
00days:00hrs:00mins:00secs

4 Family Members Included

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

Participate Now

You won't be charged yet

పూజ వీడియో 48 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య అంశల సమ్మేళన స్వరూపం ‘శ్రీ దత్తాత్రేయ స్వామి’. అత్రి మహర్షి, అనసూయ మాతల తపఃఫలంగా అవతరించిన ఆయన సాక్షాత్తూ ఆదిగురువుగా పూజలందుకుంటారు. ‘దత్త’ అంటే ఇచ్చేవాడు అని, ‘ఆత్రేయ’ అంటే అత్రి మహర్షి కుమారుడు అని అర్థం. జ్ఞానప్రదాత, అజ్ఞాన వినాశకుడైన ఆ జగద్గురువు అవతరించిన పవిత్ర దినం ‘దత్తాత్రేయ జయంతి’. ప్రతి మార్గశిర పౌర్ణమి నాడు వచ్చే ఈ జయంతి రోజున స్వామివారిని ఆరాధించడం విశేష ఫలప్రదమని ప్రతీతి. అందుకే ఈ డిసెంబర్ 23న వేదమందిర్ దత్తాత్రేయ మహా హోమం మరియు గురు పాదుకా పూజ నిర్వహిస్తోంది. ఈ దివ్య ఆరాధనలో మీరూ భాగస్వాములై గురుకటాక్షం, జ్ఞానసంపద, సర్వశ్రేయస్సు కోసం ప్రార్థించవచ్చు. 

జ్ఞానాన్ని ప్రసాదించే దత్తాత్రేయ హోమం 
త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం చేసే పవిత్ర అగ్ని ఆరాధనే ‘దత్తాత్రేయ హోమం’. జ్ఞానవృద్ధి, గ్రహదోష శాంతి, పితృదోష నివారణ, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ఈ హోమాన్ని నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి నాటి దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆచరించడం మరింత విశేషమని నమ్ముతారు. దత్తాత్రేయ మూలమంత్రంతో అగ్నికి ఆహుతులు సమర్పించే ఈ హోమం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. సంచిత పాపాల ప్రభావం తగ్గి, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కార్యసిద్ధి కోరుతూ ఈ క్రతువులో పాల్గొనవచ్చు. 

గురు కటాక్షం కోసం ‘పాదుకా పూజ’ 
గురు పాదాల చెంత లభించే జ్ఞానానికి, శిష్యుడి అచంచల భక్తికి ప్రతిరూపమే గురు పాదుకలు. జీవితంలో సరైన మార్గాన్ని చూపించి, జ్ఞానవంతమైన నిర్ణయాలకు దిశానిర్దేశం చేసేది గురు కటాక్షమే. గురువు భౌతికంగా సమీపంలో లేకున్నా, ఆయన జ్ఞానమార్గం మనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తుందని పాదుకా ఆరాధన తెలియజేస్తుంది. పాదుకలకు పుష్పాలు, గంధం సమర్పిస్తూ, శ్రీ గురు పాదుకా స్తోత్రాన్ని పఠించి గురుదేవుని మహిమను కీర్తిస్తారు. ఈ పూజతో అజ్ఞానపు పొరలు తొలగి, వినయం, వివేకం, గురు అనుగ్రహం సిద్ధించాలని ప్రార్థిస్తారు. 

24 మంది గురువుల నుంచి జ్ఞానం పొందిన మహాయోగి! 
జ్ఞానం కేవలం పుస్తకాలు, గురువుల బోధనల నుంచే కాదు.. ప్రకృతిలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు నుంచి కూడా లభిస్తుందని మహాయోగి దత్తాత్రేయుడు నిరూపించాడు. భాగవతంలోని ఏకాదశ స్కంధం 7-9 అధ్యాయాల్లో యదు మహారాజుకు 24 మంది గురువుల నుంచి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఒక అవధూతుడు వివరిస్తాడు. దత్తాత్రేయుడిగా గుర్తించే అవధూతుడు భూమి నుంచి సహనం, గాలి నుంచి నిర్లిప్తత, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, నీటి నుంచి పవిత్రత, అగ్ని నుంచి తేజస్సు వంటి గొప్ప జీవిత సత్యాలను ఆయన గ్రహించారు. అలాగే సూర్యుడు, చంద్రుడు, పావురం, కొండచిలువ, సముద్రం, సాలెపురుగు వంటి ప్రకృతి జీవుల నుంచి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకున్నారు. 

ఆశను జయించిన ఆత్మజ్ఞానం కోసం.. 
విదేహ నగరంలో పింగళ అనే వేశ్య ఉండేది. ఓ రాత్రి తనను ఆశ్రయించడానికి ఎవరైనా వస్తారని ఎదురుచూసినా ఎవరూ రాక నిరాశకు గురైంది. బాహ్య సుఖాలపై ఆశే తన అశాంతికి కారణమని గ్రహించి, ఆ ఆశలను వదిలి అంతరంగంలో ప్రశాంతతను పొందింది. ఈ వృత్తాంతంలో పింగళను తన 24 మంది గురువుల్లో ఒకరిగా అవధూతుడు పేర్కొంటాడు. దత్తాత్రేయుడిగా గుర్తించే ఆ అవధూతుడు, ఆశలను అదుపులో ఉంచుకుని అంతరంగంలో ఆనందాన్ని వెతుక్కోవడమే నిజమైన ప్రశాంతత అనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. 

ప్రతి రూపంలోనూ దాగిన దివ్య తత్త్వం 
3 తలలతో త్రిమూర్తుల ఏకత్వాన్ని చాటుతూ, 6 చేతుల్లో దివ్యాయుధాలు, పవిత్ర వస్తువులు ధరించి స్వామివారు దర్శనమిస్తారు. ఆయన వెనుక నిలిచే 4 శునకాలు 4 వేదాలకు, పక్కనే ఉండే ఆవును కామధేనువు, భూమాత స్వరూపంగా భావిస్తారు. సమీపంలోని ఔదుంబర వృక్షం దత్త సంప్రదాయంలో పవిత్రమైనది. ఈ దివ్య స్వరూపం సృష్టి, స్థితి, లయల సమైక్యతను, సమస్త జీవుల్లో దైవత్వాన్ని దర్శించే విశాల దృష్టిని గుర్తుచేస్తుంది. ఇంత గొప్ప స్వామివారిని అర్చన, హోమాలతో ఆరాధించడం ద్వారా గురు కటాక్షం, జ్ఞానప్రాప్తి కలగాలని ప్రార్థించవచ్చు. 

గురుదేవుని కృపతో జ్ఞానప్రకాశం! 
ఈ ప్రపంచమే ఒక గురుకులం.. అందులో కనిపించే ప్రతి జీవి, ప్రతి అనుభవం ఒక గురువు అనే గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన ఆదిగురువు దత్తాత్రేయుడి అనుగ్రహం కోరే పవిత్ర అవకాశం ఇదే! త్రిమూర్తుల దివ్యశక్తి, ఆదిగురువు అనుగ్రహం కలగలిసిన ఈ దత్తాత్రేయ జయంతి పర్వదినాన స్వామివారి పాదపద్మాలను ఆశ్రయించండి. మనసులోని అజ్ఞానాన్ని తొలగించి, ఆలోచనలకు వివేకాన్ని, అడుగులకు సరైన దిశను, జీవితానికి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించమని ఆ దత్తగురువును వేడుకుందాం. శ్రీ గురుదేవ దత్త!
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

గురుకటాక్షం

గురుదేవుని అనుగ్రహం, జ్ఞానప్రాప్తి కోసం ప్రార్థించవచ్చు.

2

విద్యా వికాసం

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, వివేకం పెంపొందాలని కోరుకోవచ్చు.

3

సరైన మార్గదర్శకత్వం

సందిగ్ధతలు తొలగి, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కలగాలని ప్రార్థించవచ్చు.

4

గ్రహదోష శాంతి

జాతకంలోని గ్రహ ప్రతికూలతల ప్రభావం తగ్గాలని వేడుకోవచ్చు.

5

పితృశాంతి

పితృసంబంధిత దోషాల శాంతి, పితృదేవతల అనుగ్రహం కోసం ప్రార్థించవచ్చు.

6

ఆత్మబల వృద్ధి

ధైర్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందాలని కోరుకోవచ్చు.

7

కర్మబంధ విముక్తి

కర్మబంధాల నుంచి విముక్తి, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలని ప్రార్థించవచ్చు.

8

కుటుంబ శ్రేయస్సు

కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని వేడుకోవచ్చు.

పూజ ప్రక్రియ

1

విఘ్నేశ్వర పూజ

నిర్విఘ్నంగా పూజా కార్యక్రమం పూర్తవ్వాలని గణపతిని ప్రార్థిస్తూ పూజ ప్రారంభిస్తారు.

2

శ్రీ దత్తాత్రేయ ఆవాహన

దత్తాత్రేయ స్వామివారిని ఆవాహన చేసి, సంకల్పంతో షోడశోపచార పూజ నిర్వహిస్తారు.

3

దత్తాత్రేయ మూలమంత్ర జపం

స్వామివారి అనుగ్రహం కోసం దత్తాత్రేయ మూలమంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తారు.

4

దత్తాత్రేయ మహా హోమం

వేదమంత్రాలు, దత్తాత్రేయ మూలమంత్రాలతో అగ్నికి ఆహుతులు సమర్పిస్తూ హోమం నిర్వహిస్తారు.

5

శ్రీ గురు పాదుకా పూజ

గురు పాదుకలకు గంధం, పుష్పాలు సమర్పించి శ్రీ గురు పాదుకా స్తోత్రాన్ని పఠిస్తారు.

6
✦ ప్రధాన పూజా విధి

పూర్ణాహుతి, మంగళహారతి

లోకక్షేమం, కుటుంబ శ్రేయస్సు, గురుకటాక్షం కోసం ప్రార్థిస్తూ పూర్ణాహుతితో క్రతువును ముగిస్తారు.

పూజలో మీకు లభించేవి

మీ నామ, గోత్రాలతో మహాసంకల్పం

పూర్తి వీడియో 48 గంటల్లో మీ Whatsappకి

దేవాలయం వివరాలు

శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం

తిరుపతి

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
దత్తాత్రేయ హోమం మరియు శ్రీ గురుదత్త పాదుకా పూజ
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 48 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.

You won't be charged yet

ISO Certified 27001100% Secure PaymentCustomer Support