ప్రత్యేక ముహూర్తాన కుంకుమార్చన

అఖండ ఐశ్వర్యం కోసం శ్రీ మహాలక్ష్మీ కుంకుమార్చన

  • వృత్తి & ఉద్యోగ అభివృద్ధి
  • ఆర్థిక ఇబ్బందులు
  • వ్యాపార అవరోధాలు
శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్, తెలంగాణ
18 Nov 9:30AM ఇంకా 00:00:00 మాత్రమే మిగిలి ఉన్నాయి!

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

BOOK NOW

You won't be charged yet

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

‘కుంకుమ’ అంటే కేవలం నుదుట ధరించే అలంకారం మాత్రమే కాదు. అది ఆదిపరాశక్తి తత్త్వానికి, మంగళానికి, సౌభాగ్యానికి ప్రతీక. అందుకే అమ్మవారి ఆరాధనలో కుంకుమకు విశేషమైన స్థానం ఉంది. అటువంటి మంగళప్రదమైన కుంకుమతో సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిని ఆరాధించే పవిత్ర విధానమే ‘కుంకుమార్చన’. ఈ పూజలో అమ్మవారి దివ్యనామాలను స్మరిస్తూ, ఒక్కో నామానికి కుంకుమను సమర్పించి భక్తితో అర్చిస్తారు. ఇలా లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఐశ్వర్యం వృద్ధి చెందాలని, జీవితంలోని ప్రతి అడుగులోనూ అమ్మవారి అనుగ్రహం తోడుగా ఉండాలని ప్రార్థిస్తారు. హైదరాబాద్‌లోని శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ ఆలయంలో వేదమందిర్ ఆధ్వర్యంలో ఈ విశేష కుంకుమార్చన ప్రతిరోజూ నిర్వహించబడుతోంది. ఈ పవిత్ర ఆరాధనలో మీరు కూడా భాగస్వాములై, శ్రీమహాలక్ష్మి కటాక్షాన్ని పొందవచ్చు.
   
కుంకుమార్చనలో ఆంతర్యం
దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మి సకల లోకాలకు మంగళం, సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతగా కొలువుదీరింది. ఆపై భండాసుర సంహారంతో ఆదిపరాశక్తిగా ఎర్రటి కుంకుమతో పూజలు అందుకుంది. ఇలా కుంకుమకు అమ్మవారి శక్తితో, సౌభాగ్యంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అందుకే అమ్మవారికి కుంకుమను సమర్పిస్తారు. తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. మన జీవితాల్లో మంగళం, సౌభాగ్యం వెల్లివిరియాలని కుంకుమార్చన నిర్వహిస్తారు. ఈ ఆరాధనలో భాగంగా ఇంట ధనధాన్యాలు వృద్ధి చెందాలని, సంపాదించిన సంపద నిలకడగా ఉండాలని, వ్యాపారాభివృద్ధి కలగాలని ప్రార్థించవచ్చు.

ఎర్రటి కుంకుమతో ‘కార్యసిద్ధి’ 
ఎరుపు రంగు శక్తికి, విజయానికి, మంగళానికి ప్రతీక. అందుకే మహాలక్ష్మీ ఎర్రని పద్మంపై కొలువుదీరి, ఎర్రటి కుంకుమను ధరిస్తుంది. ఈ రంగు శ్రీమహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రంగు పూలతో అమ్మవారిని అర్చిస్తే ఎంతటి శుభఫలితాలు ఉంటాయో ఎర్రటి కుంకుమతో అర్చిస్తే అంతకన్నా రెట్టింపు ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతారు. అందుకే అమ్మవారికి కుంకుమ సమర్పిస్తూ, ఆమె అనుగ్రహం కోసం ‘కుంకుమార్చన’ నిర్వహిస్తారు. భక్తిభావం పెంపొందించే ఈ విశేష ఆరాధన ద్వారా కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకాకూడదని ప్రార్థించవచ్చు. ఈ ఆరాధనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. 

కుటుంబ క్షేమం కోసం ‘కుంకుమార్చన’ 
సీతమ్మ నుదుట సింధూరం ధరించడానికి గల కారణం తెలుసుకున్న హనుమంతుడు తన ఒళ్లంతా సింధూరం పూసుకున్నాడనే కథ మీకు తెలిసే ఉంటుంది. సీతమ్మను సింధూరం ఎందుకు ధరిస్తున్నారని అడిగినప్పుడు శ్రీరాముడి క్షేమం, ఆయురారోగ్యాల కోసం అని సీత చెబుతుంది. తన ప్రభువుకు మరింత మేలు జరగాలని భావించిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరం పూసుకుంటాడు. ఈ కథలోని భక్తి, ప్రేమ, అంకితభావం ప్రతి కుటుంబానికీ ఆదర్శం. కుటుంబ క్షేమాన్ని కోరుకునేవారు సీతారాముల అన్యోన్యతను స్మరిస్తూ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించుకోవచ్చు. దాంపత్యంలో ప్రేమానురాగాలు పెరగాలని, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి ఐకమత్యం నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించవచ్చు. 

మనశ్శాంతి కోసం.. 
శ్రీమహాలక్ష్మి కుంకుమార్చనలో సమర్పించిన కుంకుమను పూజానంతరం ప్రసాదంగా స్వీకరించి భ్రూమధ్య స్థానంలో ధరించడం ఎంతో పవిత్రం. యోగశాస్త్రంలో కనుబొమ్మల మధ్య ఉండే ‘ఆజ్ఞా చక్రం’ స్థానంపై ధ్యాన సమయంలో దృష్టిని నిలిపి మనసును ఏకాగ్రం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అమ్మవారి దివ్యనామాలను స్మరిస్తూ మంత్రోచ్ఛారణతో సమర్పించిన కుంకుమను ఈ స్థానంలో ధరించడం ద్వారా దైవస్మరణ మరింత బలపడుతుంది. శ్రీమహాలక్ష్మి అనుగ్రహంతో మనసులోని చంచలత్వం తగ్గి, ఆలోచనల్లో స్పష్టత, పనులపై ఏకాగ్రత, ఎలాంటి పరిస్థితులనైనా ప్రశాంతంగా ఎదుర్కొనే మనోధైర్యం కలగాలని ఈ అర్చనలో సంకల్పించవచ్చు. 

అమ్మవారి కటాక్షం కోసం ఇప్పుడే సంకల్పించండి! 
శ్రీమహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంట నిండుగా ఉండాలని కోరుకునేవారు ఈ పవిత్ర కుంకుమార్చనలో భాగస్వాములు కావొచ్చు. వేదమందిర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహించే ఈ విశేష పూజలో మీ పేరు, గోత్రంతో సంకల్పం చేయించుకొని వేదమంత్రాలు, అమ్మవారి దివ్యనామాల స్మరణతో జరిగే కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక అభివృద్ధి, మనశ్శాంతి, చేపట్టిన పనుల్లో విజయం కలగాలని మనసారా వేడుకోవడానికి ఇంతకు మించి అవకాశం లభించదు. పూజానంతరం అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరించి, భక్తితో నుదుట ధరించవచ్చు. ఇప్పుడే మీ కుంకుమార్చనను బుక్ చేసుకుని శ్రీమహాలక్ష్మి సేవలో భాగస్వాములు కండి!
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

దాంపత్య అనురాగం

భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర అవగాహన, అన్యోన్యత మరింత బలపడాలని ప్రార్థన.

2

అఖండ సౌభాగ్యం

కుటుంబంలో మంగళకరమైన వాతావరణం, సౌభాగ్యం నిరంతరం నిలవాలని వేడుకోవచ్చు.

3

గృహశాంతి

ఇంట్లో కలహాలు తగ్గి పరస్పర గౌరవం, ఆప్యాయత పెరగాలని ప్రార్థించవచ్చు.

4

శుభకార్యాల అనుకూలత

వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు సజావుగా జరగాలని కోరుకోవచ్చు.

5

కుటుంబ క్షేమం

కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు, పరస్పర ఐకమత్యం కలగాలని అమ్మవారిని వేడుకోవచ్చు.

పూజ ప్రక్రియ

1

నామగోత్రాల సమర్పణ

మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల వివరాలను సమర్పిస్తారు.

2

సంకల్పం

దాంపత్య అనురాగం, అఖండ సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం పండితులు సంకల్పం చేస్తారు.

3

కుంకుమార్చన

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలతో శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహిస్తారు.

4
✦ ప్రధాన పూజా విధి

ప్రసాదం, రక్ష

పూజానంతరం అమ్మవారి ఆశీస్సులకు గుర్తుగా పవిత్ర కుంకుమ ప్రసాదం, రక్షను భక్తులకు అందజేస్తారు.

పూజలో మీకు లభించేవి

శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి విశేష కుంకుమార్చన.

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలతో కుంకుమ సమర్పణ.

మీ పేరు, గోత్రంతో కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం.

అమ్మవారి ఆశీస్సులకు గుర్తుగా పవిత్ర కుంకుమ ప్రసాదం, రక్ష.

మీ పేరు, గోత్రంతో సంకల్పం

పూర్తి పూజ వీడియో — 24 గంటల్లో WhatsApp కి

దేవాలయం వివరాలు

శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
అఖండ ఐశ్వర్యం కోసం శ్రీ మహాలక్ష్మీ కుంకుమార్చన
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 24 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.
ISO Certified 27001100% Secure PaymentCustomer Support