ప్రత్యేక మహాలక్ష్మీ అర్చన

ఆర్థిక స్థిరత్వాన్ని అందించే శ్రీ మహాలక్ష్మీ అర్చన

  • వృత్తి & ఉద్యోగ అభివృద్ధి
  • కుటుంబ శాంతి
  • వ్యాపార అవరోధాలు
శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్, తెలంగాణ
18 Nov 9:30AM ఇంకా 00:00:00 మాత్రమే మిగిలి ఉన్నాయి!

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

BOOK NOW

You won't be charged yet

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

జీవితంలో అనుకున్న స్థాయికి ఎదగాలని, చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని, ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ఈ కోరికలన్నీ నెరవేరేందుకు సకల సంపదలకు అధిదేవత అయిన శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభించాలని భక్తులు ప్రార్థిస్తారు. పద్మాసనంపై కొలువై, స్వర్ణకాంతులతో విరాజిల్లే అమ్మవారిని అర్చించడం ద్వారా ధనవృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ ఉన్నతి, కుటుంబ సౌభాగ్యం కలగాలని కోరుకోవచ్చు. ఈ సంకల్పంతోనే వేదమందిర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ శ్రీమహాలక్ష్మీ అర్చన నిర్వహిస్తున్నారు. అమ్మవారి కృపతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడి, చేపట్టిన పనుల్లో అనుకూలత లభించి, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఈ పూజలో పాల్గొని సంకల్పించుకోవచ్చు. 

నామార్చనలో అమ్మవారి వైభవం 
శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిలోని ప్రతి నామం అమ్మవారి ఒక్కో దివ్యగుణాన్ని తెలియజేస్తుంది. 'ప్రకృత్యై నమః' అంటూ సమస్త సృష్టికి మూలమైన శక్తిని, 'విద్యాయై నమః' అంటూ జ్ఞానప్రదాయినిని, 'సర్వభూతహితప్రదాయై నమః' అంటూ సమస్త జీవుల క్షేమాన్ని కోరే జగన్మాతను స్మరిస్తాం. 'విభూత్యై నమః' అంటూ సకల వైభవాలకు మూలమైన అమ్మవారిని కీర్తిస్తాం. ఈ నామాలతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆమె దివ్యగుణాలను స్మరించుకుంటాం. ఈ నామార్చనలోని అంతరార్థం మనలో సద్గుణాలు, సత్ప్రవర్తన, జ్ఞానం పెంపొందాలని ప్రార్థించడమే. తద్వారా కుటుంబంలో సఖ్యత, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజంలో గౌరవప్రతిష్ఠలు కలగాలని అమ్మవారిని వేడుకోవచ్చు. 

శ్రీసూక్త పారాయణ విశిష్టత 
వేదాల్లో శ్రీమహాలక్ష్మి వైభవాన్ని కీర్తించే విశిష్ట స్తుతి శ్రీసూక్తం. ఇందులో అమ్మవారిని హిరణ్యవర్ణగా, సువర్ణరజతస్రజా అలంకృతురాలిగా వర్ణిస్తూ ధనం, ధాన్యం, పశుసంపద, కీర్తి, సమృద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా పదో మంత్రంలోని 'మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి' అనే వేదవాక్యం మనసులోని సత్సంకల్పాలు నెరవేరాలని, మాటలో సత్యం నిలవాలని ఆకాంక్షిస్తుంది. అంటే మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలని, మన ఆలోచనలు శుభప్రదంగా మారాలని ఈ మంత్రం బోధిస్తుంది. శ్రీసూక్త పారాయణం ద్వారా అమ్మవారిని స్తుతిస్తూ, మనసులోని మంచి కోరికలు సిద్ధించాలని, చేపట్టిన శుభకార్యాలకు విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలగాలని ప్రార్థించవచ్చు. 

దారిద్ర్య నివారణకు లక్ష్మీ కటాక్షం 
సంపాదన ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం, అప్పుల భారం తగ్గకపోవడం, వ్యాపారంలో నష్టాలు ఎదురవడం వంటి పరిస్థితులు ఆర్థిక ప్రశాంతతను దూరం చేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకునేవారు దారిద్ర్య నివారిణి అయిన శ్రీమహాలక్ష్మిని భక్తితో ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం చేసే ఈ అర్చనలో ఆర్థిక ఆటంకాలు తొలగాలని, అప్పుల నుంచి విముక్తి లభించాలని, సంపాదించిన ధనం నిలిచి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సంకల్పించవచ్చు. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, ధనాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలగాలని వేడుకోవచ్చు. తద్వారా ఆర్థిక క్రమబద్ధత, ధనస్థిరత్వం, కుటుంబానికి భద్రమైన భవిష్యత్తు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించవచ్చు. 

అష్టైశ్వర్య ప్రాప్తి కొరకు..
జీవితంలో ఎదురయ్యే విభిన్న అవసరాలకు అనుగుణంగా సంపద, ఆహార సమృద్ధి, ధైర్యం, విజయం, సంతాన సౌభాగ్యం వంటి అనుగ్రహాలను ప్రసాదించే అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఈ ఆరాధనలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతాన అభ్యున్నతి, దాంపత్య సౌఖ్యం, గృహంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని కోరుకోవచ్చు. ఇలాంటి సమస్త శుభాలను ఆకాంక్షిస్తూ వేదమందిర్ నిర్వహించే శ్రీమహాలక్ష్మీ అర్చనలో మీ పేరు, గోత్రనామాలతో సంకల్పం సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రార్థించండి. మీ కుటుంబంలో సకల శుభాలు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ విశేష అర్చనను ఇప్పుడే బుక్ చేసుకోండి.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజ ప్రయోజనాలు

1

ఉద్యోగ ఉన్నతి

పనితీరుకు తగిన గుర్తింపు, పదోన్నతులు, ఉన్నత అవకాశాలు లభించాలని ప్రార్థన.

2

వృత్తిపరమైన గుర్తింపు

చేసే పనిలో పేరు, ప్రతిష్ఠ, గౌరవం పెరిగి స్థిరమైన స్థానం లభించాలని వేడుకోవచ్చు.

3

పెట్టుబడుల్లో అనుకూలత

ఆర్థిక నిర్ణయాల్లో సరైన వివేచన, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కలగాలని ప్రార్థించవచ్చు.

4

సంపూర్ణ శ్రేయస్సు

ధనం, గౌరవం, సంతృప్తి, సుఖసంతోషాలు సమపాళ్లలో లభించాలని అమ్మవారిని వేడుకోవచ్చు.

పూజ ప్రక్రియ

1

విఘ్నేశ్వర పూజ

పూజ నిర్విఘ్నంగా పూర్తవ్వాలని శ్రీ గణపతిని ప్రార్థిస్తూ పూజ ప్రారంభిస్తారు.

2

సంకల్పం

భక్తుల పేరు, గోత్రాలతో ధనసంపద, ఉద్యోగ ఉన్నతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేస్తారు.

3

కలశ స్థాపన

వేదమంత్రాలతో కలశాన్ని స్థాపించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తారు.

4
✦ ప్రధాన పూజా విధి

మహా మంగళహారతి

లక్ష్మీ మంత్రాలు, మంగళహారతితో పూజను సంపూర్ణం చేసి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

పూజలో మీకు లభించేవి

శ్రీ మహాలక్ష్మీ విశేష అర్చన

అమ్మవారి అష్టోత్తర శతనామావళితో పుష్పార్చన.

మీ పేరు, గోత్రంతో కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం.

పూర్తి పూజ వీడియో - 24 గంటల్లో WhatsApp కి.

దేవాలయం వివరాలు

శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్

తెలంగాణ

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
ఆర్థిక స్థిరత్వాన్ని అందించే శ్రీ మహాలక్ష్మీ అర్చన
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 24 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.
ISO Certified 27001100% Secure PaymentCustomer Support