ఆటంకాల నుంచి విముక్తి కలిగించే

సంకటమోచన మహా గణపతి హోమం

  • రక్షణ & విఘ్న నివారణ
  • వృత్తి & ఉద్యోగ అభివృద్ధి
  • కుటుంబ శాంతి
సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీగణపతి దేవాలయం, తిరుపతి
2 Dec 9:30AM ఇంకా 00:00:00 మాత్రమే మిగిలి ఉన్నాయి!

10K+పూజలు నిర్వహించబడ్డాయి

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

BOOK NOW

పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది

ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు

పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి

100% ప్రామాణిక వైదిక పూజలు

పూజ గురించి

జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగాలని, నిలిచిపోయిన కార్యాలకు మార్గం లభించాలని, తలపెట్టిన ప్రతి సంకల్పం విజయవంతం కావాలని, ఉద్యోగాన్వేషణ ఫలించి ఆశించిన కొలువు వరించాలని ‘సంకటమోచన మహాగణపతి’ని ఆరాధిస్తారు. విఘ్నాలను ఖండించే విఘ్నవినాశకుడిగా, అసాధ్య కార్యాలను సుసాధ్యం చేసే సిద్ధిప్రదాతగా కీర్తింపబడే ఆ గణనాథుని దివ్య కటాక్షాన్ని పొందేందుకు ‘వేదమందిర్’ మీకు అవకాశం కల్పిస్తోంది. తిరుపతిలోని సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీగణపతి దేవాలయంలో డిసెంబర్ 2 నుంచి 5 బుధవారాల పాటు ‘సంకట మోచన మహా గణపతి హోమం’ నిర్వహిస్తుంది. ఈ పవిత్ర క్రతువులో భాగస్వాములై శుభఫలితాల కోసం మీరూ సంకల్పించవచ్చు. సంకటాలను తొలగించే ‘మహా గణపతి హోమం’ సంకటాలు తొలగి.. భక్తుల సంకల్పాలకు విజయసిద్ధి చేకూరాలనే ప్రార్థనతో మహా గణపతి హోమం ప్రారంభిస్తారు. అగ్నిసాక్షిగా, గణపతి మూలమంత్రాలు, వేదమంత్రాల పఠనంతో హోమం సాగుతుంది. పవిత్ర హోమద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తూ గణనాథుడిని ఆవాహన చేసి, ప్రతి ఆహుతితో భక్తుల సంకల్పాలను స్వామివారికి నివేదిస్తారు. ఆయన అనుగ్రహంతో విఘ్నబాధలు తొలగి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారాలని వేడుకోవచ్చు. కష్టాల నుంచి విముక్తి కలిగించి, కార్యసిద్ధికి మార్గం చూపాలనే ఈ ప్రార్థనే ఈ హోమంలోని అంతరార్థం. ఐదు బుధవారాల సంకల్పం బుద్ధి, వివేకం, జ్ఞాపకశక్తి, వాక్పటిమలకు ప్రాధాన్యమున్న బుధవారం రోజున బుద్ధిప్రదాత గణపతిని ఆరాధించడం విశేషంగా భావిస్తారు. అందుకే వరుసగా 5 వారాలు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. 5 వారాల నిరంతర ఆరాధనా అంతరార్థం ఏంటంటే.. ఒక్కరోజు ప్రార్థనతో ఆగిపోకుండా, లక్ష్యం నెరవేరే వరకు ఆయనపై విశ్వాసంతో ప్రయత్నాన్ని కొనసాగించడమే. ప్రతి వారం చేసే ప్రార్థన మన సంకల్పాన్ని ఇంకా బలపరుస్తుంది. భక్తి, విశ్వాసంతో పాటు నిరంతర కృషి తోడైతేనే లక్ష్యాన్ని చేరుకోగలమనే గొప్ప సందేశాన్ని ఈ 5 వారాల ఆరాధన అందిస్తుంది. సంకటమోచన గణపతి మహిమ ‘సంకట’ అంటే కష్టం, ఆపద, ఆటంకం. ‘మోచన’ అంటే వాటి నుంచి విముక్తి కలిగించేవాడు. భక్తుల సంకటాలను హరించి, అభయమిచ్చే దైవస్వరూపంగా గణపతి ‘సంకటమోచనుడు’గా ఆరాధింపబడుతున్నాడు. సంకటనాశన గణేశ స్తోత్రం ఆయన ద్వాదశ నామాల స్మరణ మహిమను వివరిస్తుంది. ఈ నామాలను భక్తితో స్మరిస్తే విద్య, ధనాది సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. భక్తుల అభీష్టాలకు అనుగుణంగా అనుగ్రహాన్ని ప్రసాదించే సంకటమోచనుడిని శరణు వేడటం ద్వారా కష్టాల నుంచి విముక్తి, ఆశయసిద్ధి, సర్వాభీష్ట ప్రాప్తి కలుగుతాయని నమ్ముతారు. ‘కార్యసిద్ధి’కి గణపతి కటాక్షం తలపెట్టిన కార్యాలు విఘ్నాలు లేకుండా పూర్తై, ఆశించిన ఫలితాలు త్వరగా పొందాలంటే గణపతి అనుగ్రహం కావాలని మన శాస్త్రాలు చెబుతాయి. అందుకు మహాభారత రచనలో వ్యాసుడకి గణపతి లేఖకుడిగా సహకరించిన గాథే ఉదాహరణ. గణపతి ఓ షరతుపై మహాభారతాన్ని రాయడానికి అంగీకరిస్తాడు. శ్లోకాలను ఆపకుండా చెప్పాలని గణపతి కోరగా, ప్రతి శ్లోకంలోని భావాన్ని గ్రహించాకే రాయాలని వ్యాసుడు చెబుతాడు. పరస్పర అవగాహన, అపారమైన బుద్ధికుశలత వల్లే ఆ మహత్తర కార్యం పూర్తవుతుంది. అందుకే గణపతిని ప్రార్థించి పని ప్రారంభిస్తే.. ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని, ఆశించిన కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉద్యోగ విజయానికి బుద్ధిప్రదాత ఆశీస్సులు గణేశ కార్తికేయుల లోక ప్రదక్షిణ గాథ గణపతి బుద్ధికుశలతకు చాటుతుంది. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న పోటీలో గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి విజయాన్ని సాధిస్తాడు. బుద్ధిబలంతో విజయాన్ని అందుకోవచ్చనే గొప్ప సందేశాన్ని గణపతి మనకు ఈ గాథ ద్వారా అందిస్తాడు. అందుకే గణపతిని ప్రార్థించి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఫలితాలుంటాయని నమ్ముతారు. సంకట మోచన మహా గణపతి హోమం ద్వారా ఉద్యోగ మార్గంలో అనుకూలత, పోటీ పరీక్షల్లో విజయం, సమయస్ఫూర్తి, ఉద్యోగప్రాప్తి కలగాలని కోరవచ్చు. మీ సంకల్పానికి విఘ్నేశ్వరుడి అండ అడ్డంకులు ఎంత పెద్దవైనా.. సంకల్పబలం, నిరంతర ప్రయత్నం ఉంటే విజయానికి మార్గం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నాలకు గణనాథుడి అనుగ్రహం తోడవ్వాలని కోరుకుంటూ ఐదు బుధవారాల పాటు జరిగే ఈ సంకట మోచన మహా గణపతి హోమంలో భాగస్వాములు కండి. డిసెంబర్ 2, 2026న తిరుపతిలోని సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీగణపతి దేవాలయంలో తొలి బుధవారం హోమంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ పేరు, గోత్రంతో సంకల్పం చేసుకుని గణపతి కటాక్షాన్ని కోరుకోండి.
సంప్రదాయం
వైదిక స్మృతి అనుసారం
వ్యవధి
కనీసం 2 గంటలు
ఎవరి కోసం
నలుగురు కుటుంబం

పూజలో మీకు లభించేవి

మీ పేరు గోత్రంతో సంకల్పం

సంకటమోచన మహాగణపతి ఆవాహన, అర్చన

గణపతి మూలమంత్రాలతో హోమం

పూర్ణాహుతి, మహా గణపతి ప్రార్థన

పూర్తి పూజ వీడియో — 24 గంటల్లో WhatsApp కి

దేవాలయం వివరాలు

సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీగణపతి దేవాలయం

తిరుపతి

తరచుగా అడిగే ప్రశ్నలు

Family Puja

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

శ
శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్
Verified
Couple Puja

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

ల
లక్ష్మి ప్రసన్న
విజయవాడ
Verified
Private Puja

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

స
సుజాత
డల్లాస్, USA
Verified

సమీక్షలు

4.920K+
శ

శ్రీనివాస్ రెడ్డి

గోత్రనామాలతో సంకల్పం చేసి, పూజ వీడియో WhatsApp లో పంపారు. దూరంగా ఉన్నా గుడిలో ఉన్నట్టే అనిపించింది.

5.0
ల

లక్ష్మి ప్రసన్న

అమ్మానాన్నల పేర్ల మీద పూజ బుక్ చేశాను. వీడియోలో ప్రతి పేరు, గోత్రం స్పష్టంగా చదివారు.

5.0
స

సుజాత

విదేశాల్లో ఉన్నా మా కుటుంబం కోసం ఆలయంలో పూజ చేయించుకోగలిగాం. చాలా తృప్తిగా ఉంది.

5.0
ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర పూజల్లో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలను పొందండి.
సంకటమోచన మహా గణపతి హోమం
ISO Certified 27001100% Secure PaymentCustomer Support
పూజ పూర్తయిన 24 గంటల్లో పూజ వీడియో మీ WhatsApp కి పంపబడుతుంది.
ISO Certified 27001100% Secure PaymentCustomer Support